ఏపీ ఫ్యాక్ట్ చెక్ వెబ్‌సైట్, ట్విట్టర్ అకౌంట్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. మీడియా, సోషల్ మీడియాల్లో జరిగే దుష్ర్పచారాన్ని ఆధారాలతో ఏపీ ఫ్యాక్ట్ చెక్ ద్వారా ప్రభుత్వం ఖండిస్తుందని సీఎం తెలిపారు. నడుస్తున్న ప్రచారం ఎలా తప్పో సాక్ష్యాధారాలతో చూపిస్తారు. నిజమేంటో, అబద్ధం ఏంటో తెలియచేస్తారు.
ఏపీ ఫ్యాక్ట్‌చెక్ ముఖ్య ఉద్దేశం ఇదేనని సీఎం వివరించారు. దురుద్దేశపూర్వకంగా సాగే ప్రచారం మీద అధికారులు కూడా చర్యలు తీసుకోవాలి. ఈ ప్రచారం మొదట ఎక్కడ మొదలయ్యిందో గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని జగన్ సూచించారు. ఒక వ్యక్తి లేదా వ్యవస్థ ప్రతిష్టను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసే హక్కు ఏ ఒక్కరికీ లేదు ఇలాంటి వాటికి ఎక్కడోచోట ముగింపు పలకాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.