Chandrababu: చంద్రబాబుకు ట్విస్ట్‌లు ఇస్తున్న ఏపీ సీఐడీ

Chandrababu: ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయని చంద్రబాబు లాయర్లు

Update: 2023-09-20 04:39 GMT

Chandrababu Arrest: చంద్రబాబుకు ట్విస్ట్‌లు ఇస్తున్న ఏపీ సీఐడీ

Chandrababu: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయిన చంద్రబాబుకు ఊహించని ట్విస్ట్‌లు ఎదురవుతున్నాయి. ఓ వైపు కోర్టులో బెయిల్ పిటిషన్లపై విచారణల్లో వాయిదాల పర్వం కొనసాగుతున్న వేళ సీఐడీ మరో షాక్ ఇచ్చింది. ఫైబర్ నెట్ స్కామ్ కేసులో అవినీతి జరిగిందంటూ చంద్రబాబుపై మరో పీటీ వారెంట్ దాఖలు చేసింది సీఐడీ. నిబంధనలకు విరుద్ధంగా టెరా సాఫ్ట్ కంపెనీకి కాంట్రాక్టు కట్టబెట్టారంటూ ఆరోపించింది.

అయితే ఈ కాంట్రాక్టులో 120 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని తెలిపింది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుపై సీఐడీ అభియోగాలు మోపింది. సీఐడీ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌ను ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించింది. ఇదే వ్యవహారంలో సీఐడీ అధికారులు 19 మందిపై 2021లో కేసు నమోదు చేశారు. 120 కోట్ల స్కామ్‌పై సిట్ దర్యాప్తు చేస్తోంది. టెర్రా సాఫ్ట్‌ కంపెనీకి అక్రమంగా టెండర్లు ఇచ్చారనే ఆరోపణలున్నాయి.

మరో వైపు ఇవాళ జరిగే వాదనలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే సీఐడీ పీటీ వారెంట్‌పై చంద్రబాబు తరపు లాయర్లు ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయలేదు. ఇక స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టు ఇవాళ విచారణ చేయనుంది. హైకోర్టులో క్వాష్ పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున విచారణ వాయిదా వేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు.

Tags:    

Similar News