మరోసారి హైకోర్టుకు నిమ్మగడ్డ రమేష్‌.. జగన్‌ సర్కారుపై నిమ్మగడ్డ కంప్లైంట్

Update: 2020-10-21 10:35 GMT
మరోసారి హైకోర్టుకు నిమ్మగడ్డ రమేష్‌.. జగన్‌ సర్కారుపై నిమ్మగడ్డ కంప్లైంట్
  • whatsapp icon

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది ఎన్నికల కమిషన్. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించడంలేదని, నిధులు కూడా విడుదల చేయడంలేదని నిమ్మగడ్డ పిటిషన్‌లో తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సహకరించేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు. రిట్ పిటిషన్‌పై విచారించిన ధర్మాసనం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం ఈసీకి సహకరించాలని సూచించింది. తమను ఈసీ సంప్రదించాలని ప్రభుత్వ వాదనపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతిదానికి ఫ్రభుత్వం దగ్గరకు వచ్చి ఓ రాజ్యాంగ సంస్థ అడగాలా అన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఏయే చోట్ల ప్రభుత్వం సరిగా సహకరించడంలేదో అఫిడవిట్ దాఖలు చేయాలని ఈసీకి ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది హైకోర్టు.

Tags:    

Similar News