సుప్రీంకోర్టులో ఏపీ అడ్వొకేట్ ఆన్ రికార్డ్ మార్పు..!

Update: 2020-06-08 07:52 GMT
Supreme Court (file Photo)

సుప్రీంకోర్టు లో అడ్వొకేట్ ఆన్ రికార్డ్ పై కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.. సుప్రీంకోర్టులో ఏపీ తరపు అడ్వొకేట్ ఆన్ రికార్డ్‌గా వ్యవహరిస్తున్న జీఎన్‌ రెడ్డిని తొలగించింది. ఆయన స్థానంలో కొద్దిరోజులుగా ఏపీ కేసులు వాదిస్తున్న మొహఫీజ్ నజ్కీ ను ఏవోఆర్‌గా కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. గత కొద్దిరోజులుగా న్యాయస్థానాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులు సరికాదని సుప్రీం తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. ఇటీవల రెండు సార్లు సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ ఇచ్చిన జీవోను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. అయితే దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది.


Tags:    

Similar News