ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన తోపాటు మరణించిన సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ సుబ్రహ్మణ్యం కుమార్తె పి.సింధుకు ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ అవకాశం కల్పించింది. ఈ మేరకు ఆమెను డిప్యూటీ కలెక్టర్ గా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. కారుణ్య నియామకాల నిబంధనలను మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా సింధు కృష్ణా జిల్లాలో విధులు నిర్వర్తించనున్నారని సమాచారం.
కాగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు వరుసగా రెండో సారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ నల్లమల పావురాలగుట్టలో హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. ఆ ప్రమాదంలో వైఎస్ తో పాటు అప్పుడు ఆయనకు కార్యదర్శిగా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం కూడా ప్రాణాలు కోల్పోయారు.