సుప్రీంకోర్టులోనూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఊరట లభించింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్ట్ నిరాకరించింది. ఏపీ ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ నే కొనసాగించాలని పేర్కొంది. ఈ కేసులో ప్రతివాదులకు సుప్రీంకోర్ట్ నోటీసులు జారీ చేసింది. దీనిపై రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇరు పక్షాల వాదనలు విన్న తరువాత హైకోర్టు తీర్పును సమర్ధించింది. దీంతో ఏపీ ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరిగి బాధ్యతలు చేపట్టడానికి మార్గం సుగమం అయింది.
కాగా నిమ్మగడ్డ రమేష్ కొనసాగింపును వ్యతిరేకిస్తూ ఏపీ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై నేడు కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసును త్రిసభ్య ధర్మాసనం విచారించింది. ఈ ధర్మాసనంలో సభ్యులుగా జస్టిస్ బోపన్న,జస్టిస్ బాబ్డే ,జస్టిస్ హ్రిషికేశ్ రాయ్ ఉన్నారు.