Antarvedi Fire Accident: అంతర్వేది ఘటనపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించిన సీఎం జగన్
Antarvedi Fire Accident | తూర్పుగోదావరి జిల్లాలోని సఖినేటిపల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అంతర్వేది ఆలయంలో రథం అకస్మాత్తుగా అగ్నికి ఆహుతయిన విషయం తెలిసిందే.
Antarvedi Fire Accident | తూర్పుగోదావరి జిల్లాలోని సఖినేటిపల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అంతర్వేది ఆలయంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవ రథం అకస్మాత్తుగా అగ్నికి ఆహుతయిన విషయం తెలిసిందే. దేవస్థానంలో అగ్నిప్రమాదం జరిగినపుడు దేవస్థానానికి సంబంధించిన సీసీ కెమరాలలో ఎందుకు రికార్డు కాలేదంటూ భక్తులు ఆలయ అధికారులను నిలదీశారు. సిసి కెమెరాలు పనిచేయక పోవడంతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ భక్తులు ఆందోళన కు దిగారు. అయితే, రథం దగ్ధంపై అంతర్వేది ఆలయ వంశపారంపర్య ధర్మకర్త రాజగోపాల రాజా బహుదూర్ మొగల్తూరు కోట వంశీయులు కూడా తీవ్రంగా స్పందించారు, ఘటన దురదృష్టకరమని, వెంటనే దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేసాయి. రధం దగ్ధం ఘటనపై ప్రభుత్వం సీబీఐ చే దర్యాప్తు జరిపించాలని ఆరోపించాయి. అయితే, వారి విమర్సలకు చెక్ పెడుతూ సీఎం జగన్ అంతర్వేది రథం ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు జగన్ ఆదేశాలతో కేంద్ర హోంశాఖకు డీజీపీ కార్యాలయం లేఖ పంపింది. దీనిపై రేపు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జరీ చేయనుంది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పటికే అక్కడి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు స్పెషల్ అధికారిని నియమించింది.