కన్నా లక్ష్మీ నారాయణ కోడలు అనుమానాస్పద మృతి

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంట విషాదం నెలకొంది.

Update: 2020-05-28 15:04 GMT
kanna lakshminarayana, his son and daughter-in-law (file photo)

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంట విషాదం నెలకొంది. ఆయన చిన్న కుమారుడు ఫణేంద్ర భార్య సుహారిక అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. గురువారం సాయంత్రం హైదరాబాద్ లోని మీనాక్షి టవర్స్‌లో స్నేహితురాలి ఇంటికి వెళ్లిన సుహారిక అక్కడే కుప్పకూలారు.. దీంతో ఆమెను హుటాహుటిన రాయదుర్గంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు.

అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కన్నా కోడలు మరణంపై సమచారం అందుకున్న పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇక కోడలు మృతితో కన్నా లక్ష్మీనారాయణ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. 

కాగా, సుహారిక మరణం అనుమానాస్పదంగా మారింది.  మాదాపూర్ డీసీపీ ఆధ్పోవర్లీయంలో పోలీసులు ఆమె మరణానికి కారణాలపై ఆరా తీస్తున్నారు. ఆమె స్నేహితురాలిని ప్రశ్నించేందుకు సిద్ధం అవుతున్నారు. అయితే,  కన్నా లక్ష్మీనారాయణ కుమారుడు ఎక్కడ ఉన్నారన్నది తెలియ రాలేదు.. దీనిపై కన్నా కుటుంబ సభ్యులు స్పందించాల్సి ఉంది. మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది. 

Tags:    

Similar News