ఏపీలో మూడో విడత పంచాయతీ పోరుకు రంగం సిద్ధం అయింది. మొత్తం 13 జిల్లాల్లోని 19 రెవెన్యూ డివిజన్లలో 3 వేల 249 పంచాయతీలు, 32 వేల 502 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మూడో విడత ఎన్నికల ప్రచారానికి రేపటితో తెర పడనుండగా ఫిబ్రవరి 17న ఎన్నికల పోలింగ్ అదేరోజు ఫలితాలు వెలువడనున్నాయి.
మరోవైపు నాల్గవ విడతలో 13 జిల్లాల్లోని 162 మండలాల్లో పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తం 3 వేల 299 పంచాయతీలు, 33 వేల 434 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా ఇవాళ నామినేషన్లను పరిశీలించనున్నారు. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 21న నాల్గవ విడత ఎన్నికల పోలింగ్ జరగనుండగా అదేరోజు సాయంత్రం నుంచి ఫలితాలు వెలువడనున్నాయి.