Andhra Pradesh: 1-10 విద్యార్థులకు టీవీ పాఠాలు.. టైమింగ్స్ ఇవే

Update: 2020-06-10 08:22 GMT

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో విద్యాసంస్థలు మూడపడిన విషయం తెలిసిందే. దీంతో విద్యార్ధులంతా ఇండ్లకే పరిమితం కావడంతో వారి విలువైన సమయం వృద్దా అయిపోతుంది. దీంతో అటు ప్రభుత్వం ఇటు విద్యాశాఖ అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. విద్యార్థులకు నష్టం కలగకుండా, విద్యా బోధనకు ఆటంకాలు లేకుండా ఉండేందుకు నేటి నుంచి అంటే జూన్ 10వ తేది నుంచి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు దూరదర్శన్‌ సప్తగిరి ఛానల్‌ ద్వారా పాఠాలు ప్రసారం చేయనున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు బ్రిడ్జి కోర్సు బోధించనున్నారు. అదే విధంగా 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు సబ్జెక్టు పాఠాలను బోధించనున్నారు. అంతే కాదు ప్రత్యేకంగా రూపొందించిన బ్రిడ్జి కోర్సు పుస్తకాలను 1-5 తరగతి విద్యార్థులకు అందిస్తారు. పదోతరగతి విద్యార్థులకు ప్రస్తుతం నిర్వహిస్తున్న రెండు గంటల కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. ఇక ఆన్ లైన్లో క్లాసులను విన్న విద్యార్ధులకు ఏమైనా సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేసేందుకు ఉపాధ్యాయులు వారానికి ఒక్కసారి పాఠశాలకు వస్తారు. విద్యార్ధులు ఆ రోజున పాఠశాలకు వెళ్లి వారికి ఉన్న సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌, తెలుగు సబ్జెక్టులను ఇంగ్లిష్‌ మీడియంలోనే బోధిస్తారు. జూన్‌ చివరి వరకు ఈ తరగతులు నిర్వహిస్తారు.

పాఠ్యాంశాలు బోధించే సమయ వేళలు ఇవే..!

* ఉదయం 11 నుంచి 11.30 గంటల వరకు 1, 2 తరగతుల పాఠ్యాంశాలు బోధించనున్నారు.

* ఉదయం 11.30 నుంచి 12 గంటల వరకు 3, 4, 5 తరగతులకు పాఠ్యాంశాలు బోధించనున్నారు.

* మధ్యాహ్నం 2 నుంచి 3గంటల వరకు 6, 7 తరగతులకు పాఠ్యాంశాలు బోధించనున్నారు.

* మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 8, 9 తరగతులకు పాఠ్యాంశాలు బోధించనున్నారు.

ఉపాధ్యాయులు అందుబాటులో ఉండే వేళలు..

* 17వ తేదీ నుంచి ప్రతి బుధవారం 6-7 తరగతులకు బోధించే ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు పాఠశాలల్లో అందుబాటులో ఉంటారు.

* 19 నుంచి ప్రతి శుక్రవారం నుంచి 8-9 తరగతులకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుడు అందుబాటులో ఉంటారు.

* ప్రతి బుధవారం, శుక్రవారాలు పదో తరగతికి బోధించే ఉపాధ్యాయులు అందుబాటులో ఉండనున్నారు. 

Tags:    

Similar News