రానున్న రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన!
రానున్న రెండు మూడు రోజుల్లో ఏపీలో వర్షాలు పడే సూచనలు ఉన్నట్టు విపత్తుల నిర్వహణ శాఖ చెబుతోంది. ఈ నెల 23న దక్షిణ కోస్తా మీదుగా అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉండడం, ఉత్తరాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోండడంతొ ఈ అంచనాకు వచ్చినట్టు తెలిపింది.
రానున్న రెండు మూడు రోజుల్లో ఏపీలో వర్షాలు పడే సూచనలు ఉన్నట్టు విపత్తుల నిర్వహణ శాఖ చెబుతోంది. ఈ నెల 23న దక్షిణ కోస్తా మీదుగా అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉండడం, ఉత్తరాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోండడంతొ ఈ అంచనాకు వచ్చినట్టు తెలిపింది. అదేవిధంగా తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో కూడా ఏపీలోనూ , తెలంగాణాలో అక్కడక్కడ వానలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.
ఈరోజు (మంగళ, బుధ వారాలు) రేపట్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు విపతుల నిర్వహణ శాఖ తెలిపింది. వారి అంచనా ప్రకారం తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు, కడప జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనంతపురం జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురుస్తాయని చెబుతున్నారు.
కొన్ని జిల్లాలో భారీ వర్షాలకు కురిసే అవకాశం ఉండటంతో..ప్రభావిత జిల్లాల అధికారుల్ని విపత్తుశాఖ అప్రమత్తం చేసింది. తీరం వెంబడి ఈదురుగాలులు వీస్తాయని అంచనాతో..మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్‌గా ఉండాలని హెచ్చరిస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణశాఖ చెబుతోంది. ఇటు తెలంగాణలోకి కొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.