భార‌త ర‌క్ష‌ణ శాఖలో కరోనా క‌ల‌క‌లం

భార‌త ర‌క్ష‌ణ శాఖలో కరోనా క‌ల‌క‌లం
x
Highlights

కరోనా వైరస్‌ మహ్మమారి ఏ ఒక్కరినీ వదలడంలేదు. చిన్న పిల్లల నుంచి వందేళ్ల వృద్ధులనూ మృత్యు ఒడిలోకి చేర్చుకుంటోంది. తాజాగా భార‌త ర‌క్ష‌ణ శాఖలో కరోనా...

కరోనా వైరస్‌ మహ్మమారి ఏ ఒక్కరినీ వదలడంలేదు. చిన్న పిల్లల నుంచి వందేళ్ల వృద్ధులనూ మృత్యు ఒడిలోకి చేర్చుకుంటోంది. తాజాగా భార‌త ర‌క్ష‌ణ శాఖలో కరోనా క‌ల‌క‌లం రేగింది. ఢిల్లీలోని రక్షణ శాఖలో పనిచేసే ఓ ఉన్నతాధికారికి కరోనా వైరస్‌ సోకింది. ఆయన ఇప్పటి వరకూ కొవిడ్‌-19 కట్టడి విధుల్లోనే ఉన్నట్టు సమాచారం. దీంతో వెంట‌నే ఆయ‌న‌ను క్వారంటైన్ చేసిన అధికారులు మొత్తం కార్యాల‌యాన్ని శానిటైజేష‌న్ చేయించారు.

ఆయ‌న పనిచేస్తున్న రైసినా హిల్స్‌లోని సౌత్ బ్లాక్‌లోని మిగ‌తా 35 మంది ఉద్యోగుల‌ను కూడా హోం క్వారంటైన్ చేశారు. ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా రాజ్‌నాథ్ సింగ్ బుధ‌వారం కార్యాల‌యానికి హాజ‌రు కాలేదు. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారుల కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. బాధిత అధికారితో గత రెండు రోజుల్లో 30 మంది వ్యక్తులు సన్నిహితంగా ఉన్నట్లు తెలిసింది. వారిని హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. దీంతో మొత్తం కార్యాల‌యాల‌ను శుభ్రం చేయించి ఉద్యోగుల‌ను త‌దుప‌రి ఆదేశాలు వ‌చ్చే వ‌ర‌కు హోం క్వారంటైన్‌లో ఉండాల‌ని ఆదేశాలు జారీ చేశారు.


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Show Full Article
Print Article
Next Story
More Stories