UGC Exam Update: యుజీసీ ఎగ్జామ్స్ కు గ్రీన్ సిగ్నల్.. నిబంధనలు పాటించాలంటూ సూచనలు

UGC Exam Update: యుజీసీ ఎగ్జామ్స్ కు గ్రీన్ సిగ్నల్.. నిబంధనలు పాటించాలంటూ సూచనలు
x
Highlights

UGC Exam Update: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అన్ని వ్యవస్థలు అతలాకుతలం అయిపోయాయి.

UGC Exam Update: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అన్ని వ్యవస్థలు అతలాకుతలం అయిపోయాయి. విద్యా వ్యవస్థ అయితే చెప్పలేని రీతిలో దారుణంగా దెబ్బతింది. పబ్లిక్, సాధారణ తరగతులు అనే తేడా లేకుండా పరీక్షలన్నింటినీ రద్దు చేశారు. కొన్ని చోట్ల నిర్వహిద్దామని భావించినా, కోర్టులు సైతం ఎందుకొచ్చిన కష్టాలంటూ నిలిపివేస్తున్నాయి. అయితే ఇన్ని సమస్యలున్నా ఒక రాష్ట్రంలో పరీక్షలకు వెళ్లి విద్యార్థులను కరోనా బారిన వేసిన సంఘటలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో యూనివర్సిటీలు, వాటి అనుబంధ సంస్థల్లో ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే వీటిని కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కోవిద్ నిబంధనలను అనుగుణంగా నిర్వహించాలని సూచనలు చేసింది.

కరోనా వైరస్ ధాటికి విద్యా వ్యవస్థ స్వరూపమే మారిపోయింది. విద్యాసంవత్సరం ముగిసినా ఎగ్జామ్స్ నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అన్ని రకాల పరీక్షలు నిలిచిపోయాయి. అయితే, యూనివర్సిటీలు, వాటి అనుబంధ సంస్థల్లో ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం అనుమతిచ్చింది. ఈ మేరకు కేంద్ర ఉన్నత విద్యాశాఖ అధికారికి లేఖ రాసినట్లు వెల్లడించింది.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జారీ చేసిన కొవిడ్‌-19 నిబంధనలను పాటిస్తూ పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించింది. యూజీసీ మార్గదర్శకాలు, వర్సిటీలకు సంబంధించిన అకాడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం తుది పరీక్షలను తప్పనిసరిగా నిర్వహించాల్సిందేనని పేర్కొంది. మరోవైపు కరోనా సమయంలో పరీక్షలు నిర్వహించడం ద్వారా వైరస్ వ్యాప్తి కలుగుతుందని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పరీక్షలను రద్దు చేసి గ్రేడింగ్ ద్వారా విద్యార్థులను ఉత్తీర్ణులను చేసింది. తాజగా కేంద్రం ఇచ్చిన ఆదేశాలతో అన్ని వర్సిటీ స్థాయి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉంటుంది.కొవిడ్‌ రూల్స్ కి అనుగుణంగా విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని అయా వర్సిటీలకు ఎంహెచ్‌ఏ సూచించింది.


Show Full Article
Print Article
Next Story
More Stories