నిరుద్యోగులూ పారాహుషార్.. బ్యాంకుల్లో 12,075 క్లర్కు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!

నిరుద్యోగులూ పారాహుషార్.. బ్యాంకుల్లో 12,075 క్లర్కు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!
x
Highlights

బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఐబీపీఎస్ క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషణ్ విడుదల చేసింది.

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. బ్యాంకుల్లో క్లర్కు పోస్టుల భ‌ర్తీకి 'కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ (సీఆర్‌పీ) ఎగ్జామినేషన్-IX' నోటిఫికేషన్‌ను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్ (ఐబీపీఎస్‌) విడుద‌ల చేసింది. ప్రబుత్వ రంగ బ్యాంకుల్లో మొత్తం 12,075 క్లర్కు పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. ఇందులో తెలంగాణ కు 612, ఆంధ్రప్రదేశ్ కు 777 పోస్టులు కేటాయించారు. ఈ పోస్టులకు విద్యార్హత డిగ్రీ. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలద్వార ఎంపిక ఉంటుంది.

ఈ నెల 17 నుంచి దఖాస్తులు స్వీకరిస్తారు. అక్టోబర్ 9 వరకూ దరఖాస్తు చేసుకోవడానికి సమయం ఉంటుంది. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 600 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అదే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్మేన్ కేటగిరీ వారికి వంద రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఫీజు ఆన్లైన్ లో చెల్లించాలి. ప్రిలిమినరీ పరీక్ష డిసెంబర్ లో.. మెయిన్ పరీక్ష వచ్చే సంవత్సరం జనవరిలో నిర్వహిస్తారు. ప్రిలిమినరీ ఉత్తీర్ణులైన వారికే మెయిన్స్ రాసే అర్హత ఉంటుంది.

సంక్షిప్తంగా వివరాలివే..

విద్యార్హత..

ఏదైనా డిగ్రీ ఉండి, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఏ రాష్ట్రం నుంచి అభ్యర్థి దఖాస్తూ చేసుకుంటున్నారో ఆ రాష్ట్ర భాషలో ప్రావీణ్యం ఉండాలి., మాట్లాడటం, చదవడం, రాయడం తెలిసి ఉండాలి.

వయసు:

సెప్టెంబర్ 1, 2019 నాటికి 20-28 సంవత్సరాల మధ్య వయస్కులై ఉండాలి అంటే సెప్టెంబర్ 2,1991 - సెప్టెంబర్ 01, 1999 మధ్య జన్మించిన వారై ఉండాలి. రిజర్వేషన్ నిబంధనల ప్రకారం వయసులో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు విధానం-పీజు చెల్లింపు: ఆన్లైన్ ద్వారా

పరీక్ష ఇలా..

ప్రిలిమినరీలో మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో ఇంగ్లీష్ ౩౦, న్యూమరికల్ ఎబిలిటీ 35, రీజనింగ్ ఎబిలిటీ 35 మార్కులకు ఉంటుంది. 60 నిమిషాల సమయంలో 100 ప్రశ్నలకు జవాబివ్వాల్సి ఉంటుంది.

మెయిన్స్ లో.. 190 ప్రశ్నలతొ పేపర్ ఉంటుంది. 200 మార్కులు ఉంటాయి. జనరల్ లేదా ఫైనాన్స్ అవేర్నెస్ 50 మార్కులకు, జనరల్ ఇంగ్లీష్ 40 మార్కులకు, రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 60 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 మార్కులకు ఉంటాయి. సమయం 160 నిమిషాలు ఉంటుంది.

పరీక్షా కేంద్రాలివే..

ఏపీలో.. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం విజయనగరం

తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం



Show Full Article
Print Article
More On
Next Story
More Stories