CBSE Board Exam 2020: హాల్ టికెట్ల విడుదల

CBSE Board Exam 2020: హాల్ టికెట్ల విడుదల
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల వార్షిక పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసింది.

సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల వార్షిక పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. ఈ హాల్ టికెట్లను సీబీఎస్‌ఈ తన అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 15 నుంచి సీబీఎస్‌ఈ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 20 వరకు పదోతరగతి పరీక్షలు, ఫిబ్రవరి 15 నుంచి మార్చి 30 వరకు 12వ తరగతి పరీక్షల నిర్వహించనున్నారు.

అందులోనే పదోతరగతి ప్రధాన సబ్జెక్టుల పరీక్షలు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 18 వరకు, 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 22 నుంచి మార్చి 30 వరకు జరుగనున్నాయని సీబీఎస్ఈ తెలిపింది.

పాఠశాలల యాజమాన్యాలు సంబంధిత యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, ఇతర వివరాలను నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలి. తరువాత ఆ హాల్ టికెట్లపైన పాఠశాల ప్రిన్సిపల్ సంతకం చేసి విద్యార్థులకు అందిచాల్సి ఉంటుంది. హాల్ టికెట్ తీసుకున్న విద్యార్థులు తమకు సంబంధించిన వివరాలు పూర్తిగా ఉన్నాయా లేవా చేసుకుని ఏమైనా తప్పులు ఉంటే వెంటనే ప్రిన్సిపల్ ను దృష్టికి తీసుకువెళ్లాలి.

హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..

పదవ తరగతి షెడ్యూ్ల్...

12వ తరగతి షెడ్యూల్..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories