తెలంగాణ కోసం మరో ఉస్మానియా విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ విద్యార్థి సాయికుమార్ హాస్టల్ గదిలో ఉరివేసుకుని చనిపోయాడు. నాలుగు కోట్ల నా తెలంగాణ ప్రజలకు ఇదే నా ఆఖరి వీడ్కోలు, నా ప్రాణాలు తెలంగాణకు అంకితమిస్తున్నానని సుసైడ్ నోట్ రాసుకున్నాడు. తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న సాయికుమార్ మృతదేహం తరలింపు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. గాంధీ ఆసుపత్రి నుంచి మృతదేహాన్ని తరలించేందుకు పోలీసులు యత్నించగా విద్యార్థులు అడ్డుకున్నారు. ఇరువురి మధ్య తోపులాటకు దారితీసింది. ఆందోళనకు దిగిన పలువురు విద్యార్థుల్ని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఓయూ విద్యార్థులు గాంధీ ఆసుపత్రిలోనే నిరసనకు దిగారు. |