జాబ్ పాయింట్
పూర్తి కధనం.

కొన్ని కంపెనీలు తామే రెస్యూమ్ లు ఎంపిక చేస్తే... మరి కొన్ని కంపెనీలు ఆ పనిని ప్లేస్ మెంట్స్ కు అప్పగిస్తాయి. మనం పంపించే రెస్యూమ్ పై ది బెస్ట్ ఇంప్రెషన్‌ ఉండేలా రూపొందించుకోవాలి. అప్పుడే ఫస్ట్ స్టెప్‌ మేక్స్ ఈజీ...! రెస్యూమ్ లో కాంటాక్ట్ ఇన్ఫర్ మేషన్ లో పేరు, అడ్రస్‌, ఫోన్‌ నెం, ఇ మెయిల్‌ అడ్రస్‌ ఎక్పీరియన్స్ లో గతంలో పనిచేసిన కంపెనీలు, హొదాలు క్వాలిఫికేషన్స్ టెన్త్ నుంచి ఉన్నత విద్య వరకు వరుస క్రమంలో మార్కుల పర్సంటేజ్ తో సహా వివరాలు పొందుపర్చాలి. కంపెనీకి రెస్యూమ్‌ పంపించి పనైపోయింది అనుకోవద్దు. ఆ కంపెనీ గురించి వివరాలు అప్ డేట్ గా ఉండాలి. పర్టికులర్‌ జామ్ కు అపై చేస్తున్నప్పుడు రెస్యూమ్‌తో పాటు ఆ కంపెనీపై మీకున్న అభిప్రాయాలతో కవరింగ్‌ లెటర్‌ కూడా జత చేయండి. రెస్యూమ్‌ ఎంత హుందాగా ఉంటే మీపై అంత సదభిప్రాయం ఏర్పడుతుంది. కంపెనీకి ఎంప్టాయిస్ ను ఎంపిక చేసుకున్నట్లే మీరు కూడా మీకిష్టమైన కంపెనీని చూస్ చేసుకోవచ్చు. బ్రాండ్‌ నేమ్: కంపెనీ ఉత్పత్తులకు మార్కెట్ లో ఉన్న పేరు. కస్టమర్స్ దృష్టిలో వారి బ్రాండ్ కున్న గౌరవం. కంపెనీ చరిత్ర: కంపెనీ ప్రమోటర్ల నేపథ్యం, ఇటీవలి కాలంలో కంపెనీ విజయాలు. హెచ్‌ ఆర్‌ పాలసీ : సిబ్బంది పట్ల కంపెనీ విధానం, కంపెనీలో పని వాతావరణం, ప్రోత్సాహాలు వీటన్నింటి గురించి క్లుప్తంగా తెలుసుకొని జాబ్ లో జాయిన్‌ అయితే గుడ్‌ ఫ్యుచర్‌ ఉంటుంది.

జాబ్ పాయింట్
సవాళ్లకు సిద్ధం కాని ఆటో పరిశ్రమ: ఒబామా
పోటీలో నిలబడేందుకు గాను కొత్త వ్యాపార దృక్పధాన్ని, సాంకేతిక జ్ఞానాన్ని చేపట్టాలని తాను ఇచ్చిన సలహాకు సత్వరమే స్పందించడంలో అమెరికా ఆటో పరిశ్రమ విఫలమైందని అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఒబామా బరాక్ ధ్వజమెత్తారు.
ప్రకటనలు
 
Image not found