Telangana: రూ.500కే గ్యాస్ సిలిండర్.. ఆధార్ కార్డులతో ఏజెన్సీల ముందు క్యూకట్టిన మహిళలు

Women Queuing In Front Of Agencies With Aadhaar Card
x

Telanagana: రూ.500కే గ్యాస్ సిలిండర్.. ఆధార్ కార్డులతో ఏజెన్సీల ముందు క్యూకట్టిన మహిళలు

Highlights

Telangana: EKYC చేయించుకునేందుకు గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు

Telangana: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన ఆరు గ్యారెంటీలో రెండు గ్యారెంటీలను అమలు చేసింది. మిగతా అన్ని పథకాలను అమలు చేస్తుందని భావించిన ప్రజలు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తమకు 500 రూపాయలకు గ్యాస్ పథకం వర్తించాలని అందుకు కావాల్సిన EKYC చేయించుకునేందుకు గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు తీరుతున్నారు. అయితే సర్వర్లు మొరాయిస్తుండడంతో కేవైసీ ప్రక్రియ మందకొడిగా కొనసాగుతోంది. దీంతో ప్రజలు గంటల తరబడి క్యూలైన్లో వేచి చూడవలసిన పరిస్థితి ఎదురవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories