Hyderabad: ఇవాళ్టి నుంచి హైదరాబాద్‌లో మరింత కఠినంగా ట్రాఫిక్ రూల్స్

Traffic Rules are Strict in Hyderabad From Today
x

Hyderabad: ఇవాళ్టి నుంచి హైదరాబాద్‌లో మరింత కఠినంగా ట్రాఫిక్ రూల్స్

Highlights

Hyderabad: గీత దాటితే వాతలేనంటున్న ట్రాఫిక్ పోలీసులు

Hyderabad: గీత దాటితే తాట తీస్తామంటున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్రమిస్తే..భారీ ఫైన్లు తప్పవని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్‌లో ఇవాళ్టి నుంచి ట్రాపిక్ రూల్స్ మరింత కఠినతరం కానున్నాయి. ట్రాఫిక్ కంట్రోల్, ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ రూల్స్‌ను మరింత పక్కాగా అమలు చేయాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. రాంగ్ రూట్, ట్రిపుల్ రైడింగ్ చేస్తే ఇకపై భారీగా జరిమానాలు విధించనున్నారు. రాంగ్ రూట్, ట్రిపుల్ రైడింగ్ చేయడం వల్లే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని నగర ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ రంగనాథ్ చెప్తున్నారు. నిర్లక్ష్యంగా వాహనాలను నడపడంవల్లే ప్రమాదాలు జరుగుతున్నట్లు సర్వేలో తేలడంతో ట్రాఫిక్ ఆంక్షలను పక్కగా అమలు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

రాంగ్ రూట్లో వచ్చే వాహనాలకు భారీగా 1700 రూపాయలు, ట్రిపుల్ రైడింగ్‌కు 1200 వరకు ఫైన్ విధించనున్నారు. జీబ్రా లైన్ దాటితే 100 రూపాయలు, ఫ్రీ లెఫ్ట్‌కు అడ్డుపడితే వెయ్యి రూపాయలు ఫైన్ విధించనున్నారు. ప్రభుత్వ జీవో ప్రకారమే ట్రాఫిక్ రూల్స్‌ను అమలు చేయనున్నట్లు ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ రంగనాథ్ తెలిపారు. రూల్స్‌ బ్రేక్ చేస్తూ పట్టుబడితే వాహనదారుడిపై గతంలో ఏమైనా చలాన్లు ఉన్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకోనున్నారు. హైదరాబాద్ నగరంలో చాలా ఏరియాల్లో ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం, ఎక్కడ పడితే అక్కడ వాహనాలు పార్క్ చేయడంతో ఇబ్బందులు వస్తున్నందున ట్రాఫిక్ రూల్స్‌ను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories