కొమురంభీం జిల్లాలో హడలెత్తిస్తున్న పెద్దపులి.. భయాందోళనలో స్థానికులు

Tiger Hulchul In Komaram Bheem
x

కొమురంభీం జిల్లాలో హడలెత్తిస్తున్న పెద్దపులి.. భయాందోళనలో స్థానికులు

Highlights

Tiger: కుకూడా గ్రామంలో ఎద్దుపై దాడి చేసిన పెద్దపులి

Tiger: కొమ్రంభీం జిల్లాలో పెద్ద పులి హడలెత్తిస్తోంది. పలు ప్రాంతాల్లో సంచరిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. బెబ్బులి కదలికలతో కొమరం భీం జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే ఓ గిరిజన రైతును పొట్టన పెట్టుకున్న పెద్దపులి.. పదుల సంఖ్యలో పశువులను హతమార్చింది. దీంతో స్థానికులు పులి పేరు వింటనే భయంతో వణికపోతున్నారు. మరోవైపు అటవీశాఖ అధికారులు పులుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ బెబ్బులి వారికి చిక్కడంలేదు. దీంతో పులిని పట్టుకునేందుకు ఫారెస్ట్ అదికారులు.. హైదరాబాద్ నుండి ప్రత్యేక రెస్క్యూ టీంను రంగంలోకి దించేందుకు చర్యలు చేపట్టారు.

మరోవైపు కొమురంభీం జిల్లా బెజ్జూర్‌ మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. కుకూడా గ్రామంలో ఓ ఎద్దుపై పెద్దపులి దాడి చేసింది. పెద్దపులి సంచారంతో గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటు పెంచకల్‌పేట కొండపల్లి గ్రామ శివారులోనూ పులి సంచారం గ్రామస్తులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. బెబ్బులి కదలికలతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఎలాగైన ఫారెస్ట్ అధికారులు పులిని పట్టుకోవాలని కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories