Sangareddy: సంగారెడ్డి జిల్లాలో ఇబ్బడిముబ్బడిగా బెల్ట్ షాపులు.. పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు

There Are Many Belt Shops In Sangareddy
x

Sangareddy: సంగారెడ్డి జిల్లాలో ఇబ్బడిముబ్బడిగా బెల్ట్ షాపులు.. పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు 

Highlights

Sangareddy: పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు

Sangareddy: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండల వ్యాప్తంగా బెల్ట్ షాపులు హద్దు అదుపు లేకుండా వెలుస్తున్నాయి..మద్యం అమ్మాకాల్ని జోరుగా కొనసాగిస్తున్నారు. దీంతో ఉదయం నుంచి అర్థరాత్రి వరకు మద్యం అమ్మకాలు సాగుతున్నాయి.ఎక్సైజ్ అధికారులు పట్టించుకోకపోవడంతో, బెల్టుషాపు నిర్వాహకులకు హద్దు అదుపు లేకుండా అధిక ధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు.

కూలీ చేసి జీవనం సాగిస్తున్న పేదోడి కష్టాన్ని మద్యం షాపుల నిర్వహకులు దోసుకుంటున్నారు. నారాయణఖేడ్ మండలం పరిధిలోని అన్ని గ్రామాలలో ఐదు నుంచి పది షాపులు కొనసాగుతున్నాయంటే ఎక్సైజ్ అధికారుల పనితీరుఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు గ్రామాల్లో నామ్ కేవాస్తిగా కిరాణా దుకాణాలు ఉంటున్నాయి. వాటిలో అమ్మేది మాత్రం మద్యంమే. కొన్ని షాపుల్లో సిట్టింగ్ లు కూడా ఏర్పాటు చేస్తుస్తున్నారు.

ఎటువంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసుకున్న బెల్టుషాపులు సమయపాలన లేకుండా, తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు మద్యం అమ్మటం వల్ల అనే ఘర్షణలు జరుగుతున్నాయి. గ్రామాల్లోని కూలీ పనులు చేసుకునే నిరుపేదలు బెల్టుషాపులకు అలవాటుపడి కూలీ పనులకు సైతం పోకుండా, నిత్యం గ్రామాల్లో మద్యం మత్తులో రోడ్డు పై పడి దొర్లుతున్నారు.

నారాయణఖేడ్ పట్టణంలో ఉన్న వైన్ షాపుల నుంచి మద్యం కొనుగోలు చేసి, ఒక మద్యం బాటిల్పై ఎంఆర్పీ రేటు కంటే 30 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తూ అమ్మకాలు సాగిస్తున్నారు. సిండికేట్ గా మారి అమ్మకాలు సాగిస్తున్నారు. హోటళ్లు, కిరాణా షాపులు బెల్టు షాపులుగా తయారవుతున్నాయి. . మద్యం షాపులను రహదారుల పక్కన నిర్వహించరాదని అధికారికంగా వెళ్లడించినప్పటికి, గ్రామాల్లో రోడ్ల పక్కనే దర్జాగా మద్యం విక్రయిస్తున్నాన్నారు. అయితే బెల్ట్ షాపులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories