Ibrahimpatnam: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత.. స్ట్రాంగ్ రూమ్‌ సీల్‌ను తొలగించారని నిరసన

Tension at Ibrahimpatnam RDO Office
x

Ibrahimpatnam: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత.. స్ట్రాంగ్ రూమ్‌ సీల్‌ను తొలగించారని నిరసన

Highlights

Ibrahimpatnam: స్ట్రాంగ్ రూమ్‌లో ఉండాల్సిన బ్యాలెట్లు ఆర్డీవో కార్యాలయంలో.. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామన్న కలెక్టర్

Ibrahimpatnam: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయం వద్ద కాంగ్రెస్ నేతలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ సీల్‌ను తొలగించారని నిరసన చేపట్టారు. స్ట్రాంగ్ రూమ్‌లో ఉండాల్సిన బ్యాలెట్లు ఆర్డీవో కార్యాలయంలో కనిపించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. పోస్టల్ బాక్స్ సీల్ తొలగించి ఉండటం... బ్యాలెట్లు లేకపోవడంపై రిటర్నింగ్ అధికారిని నిలదీశారు.

కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన తర్వాత పోస్టల్ బ్యాలెట్ బాక్సులను ఆర్డీవో కార్యాలయం నుంచి స్ట్రాంగ్ రూమ్‌కు తరలించి వాటికి సీల్ వేశారు. జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని పరిశీలించారు. ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. కాంగ్రెస్ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి సోదరుడు మల్‌రెడ్డి రాంరెడ్డి పోస్టల్ బ్యాలెట్ బాక్సులు ఎలా తెరిచి ఉన్నాయని కలెక్టర్‌ను ప్రశ్నించారు. బాక్సులు తెరిచి ఉండటంపై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారని కలెక్టర్ తెలిపారు. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories