BRS VS Congress: కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్‌గా సాగిన తెలంగాణ ఎన్నికలు

Telangana Election Done Like Congress vs BRS
x

BRS VS Congress: కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్‌గా సాగిన తెలంగాణ ఎన్నికలు

Highlights

BRS VS Congress: తాము గెలిచే సీట్లను అంచనా వేసుకుంటున్న బీజేపీ నాయకులు

BRS VS Congress: బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఇది తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కనిపించిన సీన్. ఎలక్షన్ దంగల్‌లో ఈ రెండు పార్టీలే హోరా హారీగా తలపడ్డాయి. అయితే ఫలితాలకు వచ్చే సరికి ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వస్తుందని ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. కొన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని చెబుతుంటే మరికొన్ని బీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని చెబుతున్నాయి.

గ్జిట్ పోల్స్‌ను తాము పట్టించుకోవడం లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గతంలో చాలా సార్లు ఎగ్జిట్ పోల్స్‌ను తాము తప్పని నిరూపించామని గుర్తు చేశారు. ఈ సారి కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుందని కేటీఆర్ స్పష్టం చేస్తున్నారు. మూడో సారి కూడా బీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని దీంట్లో ఎలాంటి డౌట్ అవసరం లేదని కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.

మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ తమ వైపే ఉన్నాయని చెబుతున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అన్ డౌటెడ్‌గా తాము 70కి పైగా స్థానాల్లో విజయం సాధించబోతున్నామని చెబుతున్నారు. ప్రజలు కేసీఆర్ పాలనతో విసిగిపోయారని కాంగ్రెస్ జెండా తెలంగాణలో ఎగురుతుందని అంటున్నారు. మ్యాజిక్ ఫిగర్ 60 కగా.. కాంగ్రెస్‌కు ఎన్ని స్థానాలు వస్తాయన్న ఉత్కంఠ నెలకొంది.

బీఆర్ఎస్‌కు 55 స్థానాలు వచ్చినా, ఎంఐఎం వచ్చే మద్దతుతో గట్టేఅవకాశాలు ఉన్నాయి. అయితే కాంగ్రెస్‌కు ఇలాంటి ఆప్షన్ లేదు కాబట్టి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 60కి పైగా స్థానాల్లో విజయం సాధించాలని విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీకి సీట్లు పెరిగినా అది కాంగ్రెస్‌కు నష్టం చేస్తుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. దీంతో ఈ రెండు పార్టీల నేతలను 60 మ్యాజిక్ ఫిగర్‌ టెన్షన్ పట్టుకుంది.

ఇటు బీజేపీలో కూడా ఫలితాలపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఫలితాలపై బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి... నేతలతో ఇప్పటికే చర్చలు జరుపుతున్నారు. పోలింగ్ సరళి ఎలా జరిగింది? బీజేపీకి ఏ స్థానాల్లో విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నదానికై నేతలతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్,కాంగ్రెస్‌‌లకు స్పష్టమైన మెజార్టీ రాకపోతే ఎలా వ్యవహరించాలన్నదానిపై కూడా బీజేపీలో చర్చ జరుగుతున్నట్లు టాక్ నడుస్తోంది.

ఫలితాలపై రెండు పార్టీల ద్వితీయ శ్రేణి నేతల్లో కాన్ఫిడెన్స్ కనిపించడం లేదు. విజయం మాదేనంటూ పైకి చెబుతున్నా.. అన్ని పార్టీల్లో ఏ మేరకు సీట్లు సాధిస్తామన్న దానిపైనే నేతలు లెక్కలేసుకుంటున్నారు. కీలక నేతలు కూడా తాము విజయం సాధిస్తామని బలంగా చెప్పలేకపోవడంతో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నది ఇప్పుడు తెలంగాణలో బిగ్ క్వశ్చన్‌గా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories