ఇందురూ మున్సిపాలిటీలో ఆమె..మెజారిటీ స్థానాల్లో అతివలే!!

ఇందురూ మున్సిపాలిటీలో ఆమె..మెజారిటీ స్థానాల్లో అతివలే!!
x
Highlights

మున్సిపల్ ఎన్నికల నిర్వహణ పక్రియ జెట్ స్పీడ్ దూసుకెళ్తుంది. ఓటర్ల లెక్క తేల్చిన అధికారులు, వార్డుల రిజర్వేషన్లకు కసరత్తు ప్రారంభించారు. పట్టణాల్లో...

మున్సిపల్ ఎన్నికల నిర్వహణ పక్రియ జెట్ స్పీడ్ దూసుకెళ్తుంది. ఓటర్ల లెక్క తేల్చిన అధికారులు, వార్డుల రిజర్వేషన్లకు కసరత్తు ప్రారంభించారు. పట్టణాల్లో పురుషులకంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండటంతో ఈ సారి మహిళలకు ప్రాధాన్యం పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 111 స్ధానాలు మహిళలకు కేటాయించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు కామారెడ్డి, బోధన్, భీమ్‌గల్, ఎల్లారెడ్డి, బాన్సువాడ, ఆర్మూర్, మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ మున్సిపాలిటీల్లో ఓటర్ల లెక్క తేల్చిన అధికారులు పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఉన్నట్లు తేల్చారు. సామాజికవర్గాల వారీగా బీసీ ఓటర్లు అధికంగా ఉన్నట్లు ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు. వార్డులవారీగా జనాభా ప్రకటించిన అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. స్ధానిక సంస్ధల్లో 50శాతం స్ధానాలు మహిళలకు కేటాయించనుండటంతో మున్సిపాలిటీల్లో సగం వార్డులు మహిళలకు రిజర్వ్ కానున్నాయి. సగానికి పైగా మహిళలకు వార్డులు కేటాయించాలనే నిర్ణయం పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నిజామాబాద్‌ నగరపాలక సంస్థతో పాటు కామారెడ్డి, ఆర్మూర్‌, బోధన్‌, బాన్సువాడ, ఎల్లారెడ్డి, భీమ్‌గల్‌ మున్సిపాలిటీల్లో మొత్తం 220 వార్డులున్నాయి. మున్సిపాలిటీల్లో వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియను మొదటగా మొత్తం స్థానాల్లో సగం మహిళలకు కేటాయిస్తారు. తర్వాత ఈ స్థానాలను జనాభా, ఓటర్ల సంఖ్య ఆధారంగా సామాజిక వర్గాల వారీగా నిర్ణయిస్తారు. మిగతా స్థానాలను జనాభా ప్రాతిపదికన పురుషులకు సామాజిక వర్గాల వారీగా రిజర్వు చేస్తారు. కామారెడ్డి, బాన్సువాడ మున్సిపాలిటీలో బేసి సంఖ్యలో వార్డులున్నాయి. ఈ లెక్కన ఉభయ జిల్లాల్లో 111 వార్డులు మహిళలకు, 109 స్థానాలు పురుషుల కేటాయించనున్నారు.

రిజర్వేషన్ల ఉత్కంఠకు మరో రెండు రోజుల్లో తెర పడనుంది. కొత్త మున్సిపల్ చట్టానికి అసెంబ్లీ ఆమోదించిన అనంతరం జిల్లాల్లో రిజర్వేషన్లు ప్రకటించనున్నారు. ఛైర్మన్ రిజర్వేషన్లు రొటేషన్ పద్దతిలో చేస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories