Gandhi Bhavan: సోనియా గాంధీ జన్మదిన వేడుకలు.. 78 కిలోల కేక్‌ను కట్‌ చేసిన సీఎం రేవంత్‌

Sonia Gandhi Birthday Celebrations at Gandhi Bhavan
x

Gandhi Bhavan: సోనియా గాంధీ జన్మదిన వేడుకలు.. 78 కిలోల కేక్‌ను కట్‌ చేసిన సీఎం రేవంత్‌

Highlights

Gandhi Bhavan: 78 కిలోల కేక్ కట్ చేసి శుభాకాంక్షలు చెప్పుకున్న కాంగ్రెస్ నేతలు

Gandhi Bhavan: సోనియా జన్మదినం రోజే తెలంగాణ ప్రకటన వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని చెప్పారు. తెలంగాణ ఇచ్చిన సోనియా నిజంగా తెలంగాణ తల్లి అని కొనియాడారు. కార్యకర్తల త్యాగం, కష్టంతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నిలబెట్టుకుంటుందన్నారు. గాంధీ భవన్ సోనియాగాంధీ జన్మదిన వేడుకలు నిర్వహింంచారు. సీఎం హోదాలో తొలిసారి రేవంత్ గాంధీ భవన్‌కు వచ్చారు. 78 కిలోల కేక్ కట్ చేసి కాంగ్రెస్ నేతలు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories