Revanth Reddy: ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు అన్యాయం జరిగింది.. తక్షణమే ఆ ఉత్తర్వులు ఇవ్వాలి...

Revanth Reddy Letter To CM KCR About Cutoff Marks Issue
x

Revanth Reddy: ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు అన్యాయం జరిగింది.. తక్షణమే ఆ ఉత్తర్వులు ఇవ్వాలి...

Highlights

Revanth Reddy: సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు.

Revanth Reddy: సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. 8ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులకు తీవ్ర నిరాశే మిగిలిందని లేఖలో పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని విశ్వసించిన యువతకు మొండిచేయి చూపించారని అన్నారు. ఇదిగో నోటిఫికేషన్లు, అదిగో నోటిఫికేషన్లు అంటూ ఊరించడం తప్ప ఉద్యోగాలు భర్తీ చేసిందేమీలేదన్నారు. ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు అన్యాయం జరిగిందన్న రేవంత్ ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 20 శాతం, బీసీ అభ్యర్థులకు 25 శాతం కటాఫ్ మార్కులుగా నిర్ణయించారన్నారు.

అయితే EWS అభ్యర్థుల కటాఫ్ మార్కులను మాత్రం నిర్ణయించలేదని, అసలు EWS కోటానే పరిగణనలోకి తీసుకోలేదని మండిపడ్డారు. సుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రకారం చూసినా ఇది అన్యాయమేనన్నారు. EWS కోటాను నిర్ణయించి తక్షణమే ఉత్తర్వులు ఇవ్వాలని, లేనిపక్షంలో నష్టపోతున్న అభ్యర్థులకు అండగా కాంగ్రెస్ పార్టీ కార్యచరణ ప్రకటిస్తుందని లేఖలో హెచ్చరించారు టీపీసీసీ చీఫ్‌.


Show Full Article
Print Article
Next Story
More Stories