Pocharam Srinivas Reddy: స్పీకర్ సెంటిమెంట్‌ బ్రేక్ చేసిన పోచారం శ్రివాసరెడ్డి

Pocharam Srinivas Reddy Broke The Sentiment Of The Speaker
x

Pocharam Srinivas Reddy: స్పీకర్ సెంటిమెంట్‌ బ్రేక్ చేసిన పోచారం శ్రివాసరెడ్డి

Highlights

Pocharam Srinivas Reddy: బాన్సువాడ నుంచి గెలిచిన పోచారం

Pocharam Srinivas Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్పీకర్‌, బీఆర్ఎస్‌ బాన్సువాడ అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డి గెలుపొందారు. తద్వారా రికార్డును తిరగరాశారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి తన సమీప అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డిపై విజయం సాధించారు. తెలుగు రాష్ట్రాల ఎన్నికల చరిత్రలో గౌరవప్రదమైన అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేసి అనంతరం సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే విజయం సాధించారనే సెంటిమెంట్ ఉండేది. కానీ ఆ సెంటిమెంట్‌ను పోచారం బ్రేక్‌ చేశారు. ‌స్పీకర్‌గా పనిచేసిన తర్వాత కూడా విజయాన్ని అందుకున్నారు. స్పీకర్‌గా పనిచేస్తే తరువాత వచ్చే సాధారణ ఎన్నికల్లో గెలుపొందరనే సెంటిమెంట్ ఉంది. అయితే దీనిని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి బద్దలుకొట్టారు.

తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014 ఎన్నికల్లో భూపాలపల్లి నుంచి సిరికొండ మధుసూదనాచారి గెలిచారు. ఆ తర్వాత 2014 నుంచి 2018 వరకు ఆయన తెలంగాణ శాసన సభ తొలిస్పీకర్‌గా పనిచేశారు. ఆయన 2018లో జరిగిన ఎన్నికల్లో మరోసారి పోటీ చేశారు. కానీ విజయాన్ని అందుకోలేకపోయారు. ఈయన ఒక్కరే కాదు.. 1991 నుంచి పోటీ చేసిన స్పీకర్లలో ఒక్కరు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో గెలవలేదు. తాజాగా స్పీకర్‌గా ఉన్న పోచారం ఈసారి గెలిచి రికార్ట్ బ్రేక్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories