Neelam Madhu: అమ్మ నేను మీ బిడ్డనే.. నన్ను ఆశీర్వదించండి

Neelam Madhu Took the blessings of Kata Srinivas Goud mother
x

Neelam Madhu: అమ్మ నేను మీ బిడ్డనే.. నన్ను ఆశీర్వదించండి 

Highlights

Neelam Madhu: మెదక్ ఎంపీగా పోటీ చేస్తున్నా..నాకు మద్దతివ్వండి

Neelam Madhu: మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్, పటాన్ చెరు కాంగ్రెస్ ఇంఛార్జీ కాట శ్రీనివాస్ గౌడ్ ఇంటికి వెళ్లారు. కాట శ్రీనివాస్ మాతృమూర్తి భారతమ్మకు పాదాభివందనం చేసిన నీలం మధు... అమ్మ నేను మీ బిడ్డనే...పార్లమెంట్ ఎన్నికల్లో మద్దతివ్వండంటూ ఆశీస్సులు తీసుకున్నారు.

కాట శ్రీనివాస్ గౌడ్ నివాసానికి వెళ్లిన నీలం మధు ఆ సమయంలో కాట అందుబాటులో లేకపోవడంతో కాట తల్లి భారతమ్మను కలిశారు. మెదక్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం తనకు టిక్కెట్ కేటాయించిందని భారతమ్మకు నీలం మధు తెలిపారు. ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తాను, కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జీ కాట శ్రీనివాస్ గౌడ్ రామ లక్ష్మణుల వలె కలిసి ముందుకు సాగుతామని నీలం మధు స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories