KTR: పలు యూట్యూబ్ చానళ్ల తీరుపై కేటీఆర్ ఫైర్

KTR fire on the behavior of many YouTube channels
x

KTR: పలు యూట్యూబ్ చానళ్ల తీరుపై కేటీఆర్ ఫైర్

Highlights

KTR: అసత్య ప్రచారం చేస్తున్నాయంటూ మాజీ మంత్రి ట్వీట్

KTR: యూట్యూబ్‌ ఛానళ్లపై కేటీఆర్‌ ఫైర్ అయ్యారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన కొన్ని యూట్యూబ్ ఛానళ్లు అడ్డగోలుగా, అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని ట్వీట్ చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా థంబ్‌నెయిల్స్ పెడుతూ, వార్తల పేరుతో శుద్ధ అబద్దాలను చూపిస్తున్నాయని ట్వీటర్ వేధికగా మండిపడ్డారు. కొందరు అధికార పార్టీ ఇచ్చే డబ్బులకు ఆశపడి ఫేక్ న్యూస్‌లను ప్రచారం చేస్తున్నారని అన్నారు. వ్యక్తిగతంగా తనతోపాటు, బీఆర్‌ఎస్‌ పార్టీని దెబ్బతీయాలన్న కుట్ర జరుగుతుందని పేర్కొన్నారు.

గతంలో తమపై అసత్య ప్రచారాలు, అవాస్తవాలను ప్రసారం చేసిన మీడియా సంస్థల తీరుపై న్యాయపరంగా ఎదుర్కొంటామని కేటీఆర్‌ తెలిపారు. ప్రస్తుతం కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్న కుట్రపూరిత చర్యలను చట్టబద్ధంగా ఎదుర్కొంటామన్నారు. అలాంటి యూట్యూబ్ ఛానళ్లపై పరువు నష్టం కేసులు పెడతామని హెచ్చరించారు. అంతే కాకుండా ఆయా యూట్యూబ్ ఛానళ్లను నిషేధించాలని యూట్యూబ్‌కి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. తమ తీరు మార్చుకోవాలని విజ్ఞప్తి చేస్తూనే, కుట్రపూరితంగా ఛానళ్లు నడిపే యూట్యూబ్ నిర్వాహకులు చట్ట ప్రకారం నడుచుకోవాలని హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories