KCR: ఉగాది తర్వాత కేసీఆర్ రోడ్ షో

KCR Road Show after Ugadi Festival
x

KCR: ఉగాది తర్వాత కేసీఆర్ రోడ్ షో

Highlights

KCR: బహిరంగ సభలు, కార్నర్ మీటింగులకు ప్లాన్స్

KCR: పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది. రాష్ట్రంలో అధికారం చేజారడంతో క్యాడర్‌లో స్థైర్యం దెబ్బతిన్న వేళ... నేతలంతా ఒక్కొక్కరుగా కారు దిగుతుండడంతో గులాబీ బాస్ అప్రమత్తమయ్యారు. బీఆర్ఎస్‌కు మూడో స్థానమేనన్న సర్వే ఫలితాలు చెబుతుండడంతో అధినేత స్వయంగా రంగంలోకి దిగారు. శ్రేణులలో ధైర్యం నింపేందుకు... లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిచి తమ సత్తా చాటేందుకు కేసీఆర్ ప్లాన్స్ సిద్ధం చేస్తున్నారు. దాదాపుగా బీఆర్ఎస్ లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక పూర్తైన నేపథ్యంలో ఉగాది పండుగ తర్వాత కేసీఆర్ ప్రచారం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. భారీ బహిరంగ సమావేశాలకే ప్రాధాన్యమిచ్చిన కేసీఆర్ ఈసారి వాటితో పాటు.. రోడ్ షోలు, కార్నర్ మీటింగులలో ఎక్కువగా పాల్గొనాలని డిసైడ్ అయ్యారు.

మొత్తం 17 నియోజకవర్గాలలో కేసీఆర్ ప్రచారం ఉండేలా పార్టీ శ్రేణులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు గానూ... 13 స్థానాలకు ఇంతకు ముందే అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్... మరో మూడు స్థానాలకు అభ్యర్థులను నిన్న ప్రకటించారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్ నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.పద్మారావు గౌడ్... నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి, భువనగిరి నుంచి క్యామ మల్లేష్ అభ్యర్థులుగా ఖరారు చేశారు. ఇంకా హైదరాబాద్ లోక్‌సభ అభ్యర్థిని మాత్రమే ప్రకటించాల్సి ఉంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన శ్రీకాంత్‌ను దాదాపుగా ఖరారు చేసినా.. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. రెండు, మూడు రోజులలో దీనికి సంబంధించిన ప్రకటన రావొచ్చని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories