CM KCR: టార్గెట్ హ్యాట్రిక్.. ఒకే రోజు నాలుగు ప్రచార సభలకు కేసీఆర్

KCR for Four Campaign Meetings in One Day
x

CM KCR: టార్గెట్ హ్యాట్రిక్.. ఒకే రోజు నాలుగు ప్రచార సభలకు కేసీఆర్

Highlights

CM KCR: మహేశ్వరం, వికారాబాద్, జహీరాబాద్‌, పటాన్‌చెరులో సభలు

CM KCR: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్​అధినేత, సీఎం కేసీఆర్ దూసుకుపోతున్నారు. ఇవాళ 4 చోట్ల బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలలో పాల్గొననున్నారు. మహేశ్వరం, వికారాబాద్, జహీరాబాద్‌, పటాన్‌చెరులోని ప్రజా ఆశీర్వాదసభలో కేసీఆర్ పాల్గొంటారు.

మూడోసారి అధికారమే లక్ష్యంగా గులాబీదళం రాష్ట్రంలో ప్రచారాలతో హోరెత్తిస్తోంది. ఓ వైపు అభ్యర్థులు, రాష్ట్ర స్థాయి నేతలు నియోజకవర్గాల్లో పర్యటిస్తుండగా..అటు అధినేత రోజుకు రెండు మూడు బహిరంగ సభలకు హాజరవుతూ..పార్టీ అభ్యర్థులకు మద్దతివ్వాలని కోరుతున్నారు. బీఆర్ఎస్​అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించనున్న ప్రజాఆశీర్వాద బహిరంగ సభలకు గులాబీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశాయి. సీఎం కేసీఆర్ పాల్గొనే 2 బహిరంగసభలకు పోలీసుశాఖ భారీబందోబస్తు ఏర్పాటు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories