సీపీఎంది సెల్ఫ్‌గోలా..పక్కా ప్లానా?

సీపీఎంది సెల్ఫ్‌గోలా..పక్కా ప్లానా?
x
Highlights

రెండుసార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. కానీ నామినేషన్‌ తిరస్కరణకు గురికాలేదు. అదెంటో, ఇప్పుడే, అదీ కూడా బైపోల్‌లోనే సీపీఎం అభ్యర్థి...

రెండుసార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. కానీ నామినేషన్‌ తిరస్కరణకు గురికాలేదు. అదెంటో, ఇప్పుడే, అదీ కూడా బైపోల్‌లోనే సీపీఎం అభ్యర్థి నామినేషన్‌ రిజెక్ట్‌ అయ్యింది. కానీ ఈ తిరస్కరణ వెనక తిరకాసు వుందన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఇంతకీ హుజూర్‌ నగర్‌లో సీపీఎంది సెల్ఫ్‌ గోలా పక్కా ప్లానా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కమ్యూనిస్టు పార్టీల ఉనికే ప్రశ్నార్థకం అవుతోందనడానికి ఇదే నిదర్శనమా?

హుజూర్‌ నగర్. ఇపుడు రాష్ట్ర్ర రాజకీయాలన్నీ, దీని కేంద్రంగానే సాగుతున్నాయి. నామినేషన్ల ఘట్టం ముగిసి తిరస్కరణ, విత్ డ్రా తర్వాత మొత్తం బరిలో 28 మంది అభ్యర్ధులు ఉన్నారు. ఇందులో పదమూడు మంది రాష్ట్ర్ర జాతీయ పార్టీలకు చెందిన అభ్యర్ధులు పోటీలో ఉండగా, మిగతావాళ్లు స్వతంత్ర బరిలో ఉన్నారు. అయితే మొత్తం 76 మంది నామినేషన్లు వేయగా అందులో 45 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నామినేషన్ తిరస్కరణకు గురైన వాటిలో సిపిఎం పార్టీ అభ్యర్ధి పారేపల్లి శేఖర్ రావు కూడా ఉన్నారు.

సిపిఎం నామినేషన్‌కు ఏకంగా ఆపార్టీ రాష్ట్ర్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కూడా హాజరయ్యారు. కానీ నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో సిపిఎం శ్రేణులు సెల్ప్ గోల్ చేసుకున్నట్టయ్యింది. 2014, 2018 ఎన్నికల్లో హుజూర్‌ నగర్ నుంచి పారేపల్లి శేఖర్ రావు, రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి, 5,618, అలాగే 2,121 ఓట్లను తెచ్చుకున్నారు. కానీ మూడోసారి కూడా ఉప ఎన్నికల్లో ఆయననే అభ్యర్ధిగా నిలబెట్టింది సిపిఎం అధిష్టానం. ఇంత అనుభవమున్నా, నామినేషన్ తిరస్కరణ ఎంటనీ ఇంటా బయటా చర్చ నడుస్తోంది. దీంతో సిపిఎంపై ఒత్తిడి పెరిగింది. నామినేషన్ తిరస్కరణపై న్యాయ పోరాటం చేస్తామని సిపిఎం జిల్లా నేతలు ప్రకటించారు. కానీ బరిలో ఉండకుండా ఓ ఫ్లాన్‌తోనే నామినేషన్ పోయేలా ఫ్లాన్ చేసారని ఇతర పార్టీల నేతలు చర్చించుకుంటున్నారు .

నల్లగొండలో కమ్యూనిస్టులు అంటే సిపిఐ,సిపిఎంలు. గతంలో ఎంపీ ఎమ్మెల్యేలు గెలిచి పలు స్ధానాల్లో పెట్టని కోటగా ఆపార్టీకి క్యాడర్ ఉండేది. కానీ నేడు అది జీరో అయిపోయింది. 2014 ,2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తో చెలిమి చేసిన సిపిఐ, ఈసారి హుజూర్‌ నగర్ లో పోటీ చేయకుండానే టిఆర్ఎస్ కు మద్దతు ప్రకటించింది. ఈ మద్దతుపై ఇతర పార్టీల నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. దేవరకొండ నుంచి 2014లో కాంగ్రెస్ పొత్తుతో గెలిచిన సిపిఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ టిఆర్ఎస్ లో చేరారు. దీంతో సిపిఐకి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండానే పోయింది. అటువంటి పార్టీకి మద్దతు ఎంటనీ, దాదాపు అన్ని పార్టీలు విమర్శించాయి.

ఇక సిపిఎం పార్టీ నామినేషన్ తిరస్కరణ, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉభయ కమ్యూనిస్టులు ఉనికినే ప్రశ్నార్ధకం చేసేలా మారాయి. సిపిఐ ఇప్పటికే టిఆర్ఎస్ కు హుజూర్‌ నగర్ ఉపఎన్నికలో మద్దతు అని ప్రకటించగా రాష్ట్ర్ర కమిటీలో చర్చింది ఈనెల ఆరున తమ నిర్ణయం వెల్లడిస్తామని సిపిఎం తెలిపింది అయితే హుజూర్‌ నగర్ లో మద్దతివ్వాలని సిపిఎంను కోరింది టిడిపి. ఇక హుజుర్ నగర్ ఉపఎన్నిక టిఆర్ఎస్ ఇంచార్జ్ పల్లా రాజేశ్వర్ రెడ్డి సైతం, టిఆర్ఎస్‌కు మద్దతివ్వాలని మీడియా పూర్వకంగా విజ్ణప్తి చేసారు.

మొత్తంగా హుజుర్ నగర్ ఉప ఎన్నిక, అటు సిపిఐ ఇటు సిపిఎంల ఉనికిని ప్రశ్నించేలా చేసింది. గతమెంతో ఘనం నేడు హీనం అన్నచందంగా ఆపార్టీల పరిస్ధితి తయారైందని రాజకీయ పండితులు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. సిపిఐ టిఆర్ఎస్ కు మద్దతు నేపథ్యంలో, సిపిఎం మద్దతు కూడా గులాబీకే అన్న చర్చ జరుగుతోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories