Revanth Reddy: హరీష్‌రావు సీసపద్యంలా రాజీనామా లేఖ ఇచ్చారు

Harish Rao Has Given His Resignation Letter Says Revanth Reddy
x

Revanth Reddy: హరీష్‌రావు సీసపద్యంలా రాజీనామా లేఖ ఇచ్చారు

Highlights

Revanth Reddy: స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా లేఖ ఇవ్వాలి

Revanth Reddy: తెలంగాణలో రైతు రుణమాఫీ.. సీఎం రేవంత్‌రెడ్డి, హరీష్‌రావుల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. రాజీనామాలకు దారి తీస్తోంది. ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ చేయాలని... అలాచేస్తే తన పదవికి రాజీనామా చేస్తానంటూ ఇవాళ రాజీనామా లేఖతో గన్‌పార్క్‌ వద్దకు వెళ్లారు హరీష్‌రావు. అయితే... హరీష్‌రావు రాజీనామా లేఖపై సెటైర్‌ వేశారు సీఎం రేవంత్‌రెడ్డి. రాజీనామా లేఖకు ఒక ఫార్మాట్‌ ఉంటుందని, ఆ ఫార్మాట్‌లో కాకుండా సీసపద్యంలా రాజీనామా లేఖ ఇచ్చారన్నారు. స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా లేఖ ఇవ్వాలన్నారు రేవంత్. ఇక... హరీష్‌రావు సవాల్‌ను మరోసారి స్వీకరించారు సీఎం రేవంత్‌రెడ్డి. పంద్రాగస్టులోగా 2లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతామని ఘంటాపథంగా చెప్పారు. రైతులకు రుణమాఫీ చేయకుంటే తమకు అధికారం ఎందుకన్నారు. హరీష్‌రావు రాజీనామా లేఖ రెడీగా ఉంచుకోవాలన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories