Telangana: తెలంగాణలో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ

Female voters are more than male in Telangana
x

Telangana: తెలంగాణలో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ

Highlights

Telangana: సుమారు లక్షా 81 వేల మంది మహిళా ఓటర్లు అధికం

Telangana: సార్వత్రిక ఎన్నికల సమరానికి అంతా సిద్ధమయ్యారు. ఈ ఏడాది దేశంలో సార్వత్రిక ఎన్నికలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను ఎన్నికల సంఘం చకచకా చేసేస్తోంది. ఇప్పటికే మొదటి విడత ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్, మే నెలల్లో ఏడు విడతల్లో పోలింగ్ నిర్వహించి... జూన్ 4న ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ నేపథ్యంలోనే దేశంలోని రాజకీయ పార్టీలు సమాయత్తమయ్యాయి. అటు ముచ్చటగా మూడోసారి అధికారంలో రావాలని ఎన్డీయే వ్యూహాలు రచిస్తుంటే... ఎలాగైనా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఇండియా కూటమి ప్లాన్ చేస్తుంది. ఇక ఎన్నికల సంఘం తన పనిలో తాను నిమగ్నమైపోయింది. ఓటర్ల జాబితాను రాష్ట్రాల వారీగా విడుదల చేస్తోంది.

తెలంగాణ ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ఫైనల్ చేసింది. ఎన్నికల తుది జాబితాను ఈసీ ప్రకటించారు. 17 పార్లమెంట్ సెగ్మెంట్‌లలోని ఓటర్ల వివరాలను అప్‌డేట్ చేసి తాజా వివరాలను అధికారులు వెల్లడించారు. తెలంగాణలో 3 కోట్ల 30 లక్షల 13 వేల 318 మంది ఓటర్లు ఉంటే... ఇందులో మహిళలు కోటి 65 లక్షల 95 వేల 896 మంది, పురుషులు కోటి 64 లక్షల 14 వేల 693 మంది, 2 వేల ౭౨౯ మంది ఇతరులు ఉన్నారు. తొలితరం ఓటర్లు 8 లక్షల 72 వేల 116 మంది నమోదు అయ్యారు. ఇప్పటివరకు తయారైన ముసాయిదా ఓటర్ల జాబితాలో అడ్రస్ మార్చుకోవాలనుకునే వారికి వచ్చే నెల ౧౫ వరకు వెసులుబాటు కల్పించారు.

తెలంగాణ ఓటర్లలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నారు. సుమారు లక్షా 81 వేల మంది అధికంగా ఉన్నారు. దీంతో పార్టీలు మహిళలను దృష్టిలో పెట్టుకుని పథకాలను రచిస్తున్నాయి. ఎన్నికల మేనిఫెస్టోలు సాధారణంగా పోటీ చేసే పార్టీల మధ్య విభిన్నంగా ఉంటాయి. కానీ ఇటీవలి సంవత్సరాలలో, పోల్ మేనిఫెస్టోలు ఒక అంశం స్పష్టంగా కనిపిస్తోంది. మహిళా ఓటర్ల సంఖ్య పెరుగుతుండటంతో వారిని దృష్టిలో పెట్టుకుంటున్నాయి పార్టీలు. మహిళలు తక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో సైతం ఓటింగ్‌లో పాల్గొనేవారు మగువలే ఎక్కువగా ఉంటున్నారు. దీంతో మహిళా కేంద్రీకృత సంక్షేమ కార్యక్రమాలను పార్టీలు ప్రవేశపెడుతున్నాయి.

తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 14 ఎంపీ సీట్లు గెలవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఆరు గ్యారెంటీలతో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. సంక్షేమ పథకాల్లో మహిళలే టార్గెట్‌గా పెట్టుకున్న కాంగ్రెస్.... వారి ఓట్లపైనే లోక్‌సభ ఎన్నికల్లోనూ ఎక్కువగా ఫోకస్ పెట్టింది. తొలి గ్యారంటీగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అమలు చేసిన అన్ని స్కీమ్ లలో ప్రధాన లబ్ధిదారులు మహిళలే. ఇందులో ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ, సబ్సిడీతో గ్యాస్ సిలిండర్, మహిళా సంఘాలకు ఉచిత బీమా, మహిళ పేరుతో ఇందిరమ్మ ఇళ్లు, ఇలా ప్రతి స్కీంలో మహిళలే భాగస్వామ్యులను చేశారు. ఈ నేపథ్యంలో మహిళల ఓట్లలో మెజారిటీ కాంగ్రెస్‌కు పడేలా ప్రచార వ్యూహం రెడీ చేస్తున్నట్లు సమాచారం.

తెలంగాణలో గతంలో కంటే ఎక్కువగా సీట్లు సాధించిన బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో గణనీయంగా అభ్యర్థులను గెలిపించుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే 17 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కమలం పార్టీ... అందులో ఇద్దరు మహిళలకు అవకాశం కల్పించారు. ఇప్పటికే మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చింది బీజేపీ. లోక్‌సభ ఎన్నికల్లో దాన్ని ప్రచార అస్త్రంగా మలుచుకునే అవకాశం ఉంది. దీంతో పాటు భేటీ బచావో భేటీ పడావో కార్యక్రమాన్ని సైతం ప్రచారంలో వినియోగించుకోనున్నారు. మహిళల ఆత్మగౌరవం కాపాడామంటూ ప్రతి ఇంట్లో టాయిలెట్ల నిర్మాణం చేపట్టిన కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఆ విషయాన్ని సైతం ప్రజల్లోకి తీసుకెళ్లనుంది.

తెలంగాణలో అధికారంలో కోల్పోయిన బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఎలాగైనా మెజారిటీ స్థానాల్లో గెలిచేందుకు ప్లాన్ చేస్తుంది. 17 లోక్‌సభ స్థానాల్లో వరంగల్, మహబూబాబాద్ ఎంపీ టికెట్లను మహిళలకు కేటాయించింది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ అప్పట్లో జంతర్ మంతర్ వద్ద ఎమ్మెల్సీ కవిత ధర్నా చేశారు. కవిత ధర్నా తర్వాతే కేంద్రంలోని బీజేపీ మహిళా రిజర్వేషన్తీసుకువచ్చిందన్న ప్రచారాన్ని బీఆర్ఎస్ చేసుకుంటుంది. వీటితో పాటు గతంలో బీఆర్ఎస్ పార్టీ అమలు చేసిన కల్యాణ లక్ష్మి, వితంతు పింఛన్ వంటి అంశాలను సైతం ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రచారం చేసుకోనంది.

గతం కంటే భిన్నంగా పార్టీలు తమ మేనిఫెస్టోను తయారు చేస్తున్నాయి. మహిళా ఓటర్లనే లక్ష్యంగా చేసుకుని గతంలో తాము ఏం చేశాము... భవిష్యత్తులో ఏం చేస్తామనే విషయాన్ని ప్రజలకు వివరించనున్నాయి. తెలంగాణలో మహిళా ఓటర్లు సైతం ఎక్కువగా ఉండటంతో ఆ మేరకు హామీలు సైతం ఇవ్వనున్నాయి పార్టీలు.

Show Full Article
Print Article
Next Story
More Stories