సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు

సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు
x
Highlights

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ఆ ప్రాంత ప్రజలంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. రైల్వేస్టేషన్‌ వద్ద బాలానగర్‌...

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ఆ ప్రాంత ప్రజలంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. రైల్వేస్టేషన్‌ వద్ద బాలానగర్‌ బస్టాండ్‌ సమీపంలో భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తివివరాల్లోకెళితే సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయం దగ్గరున్న చెత్త డబ్బాలో భారీ శబ్దాలతో పేలుడు సంభవించింది.

ముత్యాలమ్మ దేవాలయం వద్ద ఉన్న చెత్త కుప్పలో పెయింట్ డబ్బాను చెత్త ఎత్తుకునే వ్యక్తి ఓపెన్ చేసే ప్రయత్నం చేయగా, ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో ఆ వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. అది గమనించిన స్థానికులు వెంటనే ఆ సమాచారాన్ని పోలీసులకు చేరవేసి బాధితున్ని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరున్నారు. అనంతరం సంఘటనా స్థలంలో బాంబ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు చేయించారు. ఆ తనిఖీల్లో చెత్తకుప్పలో ఉన్న పెయింట్‌ డబ్బా పేలిందని పోలీసులు గుర్తించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

దేవాలయం సమీపంలో జరిగిన ఈ పేలుడు సంఘటనలో నిజామాబాదు ప్రాంతానికి చెందిన 56 సంవత్సరాల రాజు గాయపడినట్లు తెలుస్తోంది. ఇతను గత 30 ఏండ్లుగా సికింద్రాబాద్లో ఆయా పరిసర ప్రాంతాల్లో చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ప్రతి రోజు లాగానే ఈ రోజు కూడా ఆలయం ప్రాంగనంలోన చెత్త ఏరుకునే పనిలో పడి సంచిలో డబ్బాలు తీసుకొచ్చి నేలకు వేసి కొట్టగా ఒక్కసారిగా కెమికల్ డబ్బా పేలినట్లు తెలుస్తోంది. ఇక దసరా రోజున అమ్మవారి గుడికి దగ్గర్లో ఈ ఘటన చోటుచేసుకోవడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. నిన్న జగద్గిరిగుట్టలో కూడా ఓ పేలుడు ఘటన చోటు చేసుకుంది. ఆటో తీస్తుండగా బ్లాస్ట్ జరిగి ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ పేలుడులో ఆటో మొత్తం అగ్నికి ఆహుతయ్యింది.

Show Full Article
Print Article
Next Story
More Stories