Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో మోసపోయిన పత్తి రైతులు

Cotton Farmers Were Cheated In Adilabad
x

Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో మోసపోయిన పత్తి రైతులు

Highlights

Adilabad: పత్తి రైతులను మోసం చేసిన పోస్టల్ అధికారి

Adilabad: పత్తి రైతుల అమాయకత్వాన్ని సొమ్ముచేసుకున్నాడు ఓ ప్రభుద్దుడు.చెప్పులరిగేలా తిరిగినా రేపుమాపు అంటూ ఫ్లేటు ఫిరాయించడంతో నమ్మిన అధికారి తమను నట్టేట ముంచాడని తెలుసుకున్న రైతులు పోలీసులను ఆశ్రయించారు.

ఆదిలాబాద్ జిల్లాలోని జైనత్, బేల,తాంసీ, తలమడుగు మండలాలకు చెందిన పలువురు రైతులు తాము పండించిన పత్తి పంటను ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో ప్రభుత్వ రంగ సంస్థ భారత కాటన్ కార్పోరేషన్ కు అమ్మారు. పత్తిని విక్రయించే రైతులు తప్పని సరిగా పట్టాపాసుబుక్ జిరాక్స్ తో పాటు ఆధార్ కార్డు జిరాక్సిలు అందించాల్సి ఉంటుంది.కొంత మంది రైతులకు సంబందించిన డబ్బులు వారివారి బ్యాంక్ అకౌంట్ల్స్ లో జమ చేయగా, మరి కొంత మంది రైతులు డబ్బులు జాబ్ కార్డుకు సంబందించిన పోస్టల్ అకౌంట్లలో అకౌంట్లలో డబ్బులు జమచేశారు.

.అయితే జాబ్ కార్డు అకౌంట్లలో డబ్బులు పడ్డవారు రోజుకు పదివేల కు మించి విత్ డ్రా చేసే పరిస్థితి లేకపోవడంతో ఒకే సారి డబ్బులు మొత్తం అవసరమున్న రైతులు ఇబ్బందులు పడ్డారు.ఇదే అదునుగా భావించిన పోస్టాఫీస్ లో పనిచేసే ప్రకాష్ జాదవ్ అనే అదికారి డబ్బులు ఏక కాలంలో కావాలనే రైతుల సంతకాలు తీసుకుని, వారికి వచ్చే ఓటీపీ నెంబర్ ఆధారంగా తన సొంత అకౌంట్లోకి జమ చేసుకున్నాడు. మొదటి రోజు కొందరు రైతులకు మొత్తం డబ్బులు ఇవ్వడంతో ఆ అధికారిపై నమ్మకం పెంచుకుని మరికొంతమంది రైతులు కూడా ప్రకాష్ జాదవ్ సూచించినట్టుగా సంతకాలు చేసి వారి సెల్ నెంపర్ కు వచ్చే ఓటీపీ నెంబర్లు అధికారికి చెప్పారు. అయితే, అధికారి సొంత ఖాతాలోకి రైతుల డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి.

ఒకే రోజు అందరికి ఇవ్వడం వీలుకాదని చెప్తూ ఒక్కరిద్దరికి డబ్బులు ఇచ్చి 15 రోజుల నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో పోలీసులకు బాధిత రైతులు ఫిర్యాదు చేశారు. బాధిత రైతులకు వెంటనే డబ్బులు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే పాయల శంకర్ రైతులకు మద్దుతుగా ఆందోళనకు దిగారు. రైతులను మోసం చేసిన అధికారి పోలీసులకు లొంగిపోయాడు. దీనిపై స్పందించిన కలెక్టర్, ఎస్పీలు విచారణ వేగవంతం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories