Congress: దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ దూకుడు.. మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ముందంజ

Congress Leading In Telangana Elections Counting
x

Congress: దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ దూకుడు.. మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ముందంజ

Highlights

Congress: దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ దూకుడు

Congress: దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ గాలి బలంగా వీస్తున్నట్లు కనిపిస్తోంది. ఖమ్మంలో కాంగ్రెస్ అన్ని స్థానాల్లో ముందంజలో ఉండగా, నల్గొండలో సూర్యాపేట మినహా అన్ని స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. కోమటి రెడ్డి బ్రదర్స్ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నారు. ఇటు నకిరేకల్‌లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశం లీడ్‌లో కొనసాగుతున్నారు

ఇటు ఖమ్మంలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసేలా కనిపిస్తోంది. మొత్తం 10 స్థానాలకు గాను కాంగ్రెస్ 9, కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థి ముందంజలో కొనసాగుతున్నారు. తుమ్మల,పొంగులేటి పంతం నెగ్గించుకుంటున్నారు. ఖమ్మంలో పువ్వాడను వెనక్కి నెట్టారు తుమ్మల. పాలేరులో పొంగులేటి ముందంజలో కొనసాగుతున్నారు. మధిరలో భట్టి 12 వేల మెజార్టీలో దూసుకుపోతున్నారు. ఓవరాల్‌గా ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థులు దూకుడు ప్రదర్శిస్తున్నారు.

మహబూబ్‌నగర్‌లో నువ్వా-నేనా అన్నట్లు ఫైట్ సాగుతోంది. మొత్తం 12 స్థానాలకు గాను 6 కాంగ్రెస్ లీడ్‌లో ఉండగా 6 స్థానాల్లో బీఆర్ఎస్ గాలి వీస్తోంది.

మెదక్‌లో బీఆర్ఎస్ 5 స్థానాల్లో ముందంజలో ఉండగా .. కాంగ్రెస్ అభ్యర్థులు 4 స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతోంది. మెదక్ స్థానాల్లో మైనంపల్లి రోహిత్ పద్మాదేవెందర్ రెడ్డిని వెనక్కి నెట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories