కేసీఆర్ మార్క్ ..నయా టీమ్...సామాజిక సమీకరణలు బ్యాలెన్స్ చేశారా..?

కేసీఆర్ మార్క్ ..నయా టీమ్...సామాజిక సమీకరణలు బ్యాలెన్స్ చేశారా..?
x
Highlights

ఎప్పుడెప్పుడా అని ఆశావహులు ఎదురు చూస్తున్న తెలంగాణ మంత్రి విస్తరణ పూర్తి అయింది. తాజాగా ఆరుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో...

ఎప్పుడెప్పుడా అని ఆశావహులు ఎదురు చూస్తున్న తెలంగాణ మంత్రి విస్తరణ పూర్తి అయింది. తాజాగా ఆరుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై మంత్రుల చేత ప్రమాణం చేయించారు. ఈ ఆరుగురు మంత్రులతో కలిపి సిఎం సహా మొత్తం 18మందితో తెలంగాణ మంత్రి వర్గం పరి పూర్ణమైంది.

తెలంగాణలో రెండోసారి కొలువు తీరిన కెసిఆర్ రెండోసారి మంత్రి వర్గ విస్తరణ చేపట్టారు. తాజాగా ఆరుగురికి మంత్రులుగా అవకాశం ఇచ్చారు. ఈ ఆరుగురి ప్రమాణ స్వీకారంతో తెలంగాణ మంత్రివర్గంలో మంత్రులు సంఖ్య సిఎంతో కలిసి 18కి చేరింది. రాజ్యాంగ నియమాల ప్రకారం తెలంగాణ శాసన సభ్యుల సంఖ్య 119ని బట్టి,17 మంది మంత్రులకు మాత్రమే అవకాశం ఉంది. సిఎం సహా మొత్తం 18 మందితో మంత్రివర్గం ఉంటుంది.

తాజాగా హరీశ్ రావు, కెటిఆర్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ లు తాజాగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో మంత్రుల సంఖ్య సిఎం కెసిఆర్ తో కలిపి 18కి చేరింది. మొదటగా ప్రచారం జరిగినట్లుగా తీసివేతలు, కూడికలు లేకపోవడంతో పాత వాళ్ళంతా తమ మంత్రి పదవులను నిలబెట్టుకున్నట్లయింది.

తెలంగాణ మంత్రి వర్గంలో మొట్టమొదటి సారిగా ఇద్దరు మహిళలకు చోటు దక్కింది. తెలంగాణ మొట్టమొదటి ప్రభుత్వ మంత్రి వర్గం నుంచి ఎన్నో డిమాండ్లు ఉన్నప్పటికీ అవకాశాలు దక్కలేదు. అనేక విమర్శలు వచ్చినా వాటిని పట్టించుకోలేదు. డిప్యూటీ స్పీకర్ గా పద్మాదేవేందర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. అప్పట్లో పలువురికి మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తారని ప్రచారం జరిగినప్పటికీ... తర్వాత అవేవీ అమలుకు నోచుకోలేదు. కాగా, రెండోసారి అధికారంలోకి వచ్చిన కెసిఆర్, మొన్నామధ్య ఇద్దరు మహిళలకు మంత్రివర్గంలో అవకాశం ఉంటుందని అసెంబ్లీలో ప్రకటించారు. ఆ మేరకు ఇచ్చిన మాట ప్రకారం కెసిఆర్, తాజా మంత్రివర్గ విస్తరణలో ఇద్దరికి చోటు కల్పించారు.

తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత విజయం సాధించిన తర్వాత, 2018 డిసెంబర్ 13 న కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు అదే రోజున మహమూద్ అలీ మంత్రిగా ప్రమాణం చేశారు. మహమూద్ అలీకి హోం మంత్రిత్వశాఖని కేటాయించారు. మిగతా శాఖలన్నీ సిఎం దగ్గరే ఉన్నాయి. ఆ తర్వాత 70 రోజులకు 2019 ఫిభ్రవరి18న మొదటి మంత్రి వర్గ విస్తరణ జరిగింది. అప్పటి రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ పది మంది మంత్రులతో రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. అప్పటి ఆ విస్తరణతో కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రుల సంఖ్య సిఎం సహా రెండు నుంచి 12 మందికి పెరిగింది. తాజాగా మరో ఆరుగురిని తీసుకోవడంతో మొత్తం మంత్రివర్గం సంపూర్ణంగా నియమించినట్లయింది.

తెలంగాణ మంత్రి వర్గంలో కూర్పు ఎలా ఉంది? సామాజిక వర్గాలు, ప్రాంతాలు, జిల్లా వారి ప్రాతినిధ్యాలు ఎలా ఉన్నాయో ఓ సారి పరిశీలిద్దాం.

ఇక తెలంగాణ మంత్రి వర్గంలో...

పురుషులు : 16

మహిళలు : 02

ఇక సిఎం సహా మొత్తం 18 మంది ఉన్న తెలంగాణ మంత్రి వర్గంలో 16 మంది పురుషులు కాగా, ఇద్దరు మహిళలు.

వెలమ సామాజిక వర్గం : 4

రెడ్డి సమాజిక వర్గం : 6

కమ్మ సామాజిక వర్గం : 1

బీసీ సామాజిక వర్గం : 4 (మున్నూరు కాపు-1, గౌడ్ -1 యాదవ్-1, ముదిరాజ్-1)

ఎస్సీ : 1 (మాల)

ఎస్టీ : 1 (లంబాడా)

ముస్లీం మైనార్టీ : 1

సామాజిక వర్గాల వారీగా చూస్తే... సిఎం కెసిఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, హరీశ్ రావు, కెటిఆర్ లు వెలమ సామాజిక వర్గానికి చెందినవాళ్ళు. కాగా, ఇంద్రకరణ్ రెడ్డి, గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి లు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు.

అత్యధికంగా కరీంనగర్ జిల్లా నుంచి 4 గురు మంత్రులు

హైదరాబాద్ జిల్లా నుంచి ముగ్గురు

మెదక్, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఇద్దరు

ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం జిల్లాల నుంచి ఒక్కొక్కరు

కరీంనగర్ జిల్లా నుంచి : 04 (ఈటల, కెటిఆర్, కొప్పుల, గంగుల)

ఇక జిల్లాలు-ప్రాంతాల వారీగా పరిశీలిస్తే...అత్యధికంగా మొట్టమొదటిసారి కరీంనగర్ జిల్లా నుంచి నలుగురు మంత్రులున్నారు. రెండో మంత్రివర్గ విస్తరణలో కొప్పుల, ఈటల స్థానాలు దక్కించుకోగా, తాజా మూడో మంత్రివర్గ విస్తరనలో కెటిఆర్, గంగుల మంత్రులుగా చేరారు. గత మంత్రి వర్గంలో కెటిఆర్ పని చేశారు. తాజాగా గంగులకు అవకాశం దక్కింది. కాగా ఈటల హుజూరాబాద్ నుంచి, కెటిఆర్ సిరిసిల్ల నుంచి, కొప్పుల ధర్మపురి నుంచి, గంగుల కరీంనగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

మొదక్ జిల్లా నుంచి : 02 (సిఎంతో కలిపి హరీశ్ రావు)

సిఎం కెసిఆర్ సొంత జిల్లా మెదక్ నుంచి హరీశ్ రావుకు మరోసారి అవకాశం దక్కింది. ఆయన గత కెసిఆర్ మంత్రి వర్గంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేశారు. తాజా మంత్రివర్గంలో తొలిసారిగా రెండో మంత్రివర్గ విస్తరణలో అవకాశం దొరికింది. కెసిఆర్ గజ్వేల్ నుంచి, హరీశ్ రావు సిద్దిపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఆదిలాబాద్ జిల్లా నుంచి : 01 (ఇంద్రకరణ్ రెడ్డి)

ఇక ఆదిలాబాద్ జిల్లా నుంచి గతంలో ఇంద్రకరణ్ రెడ్డి పని చేశారు. తాజాగా ఆయనే తన మంత్రిత్వాన్ని నిలబెట్టుకున్నారు. గతంలో ఆదిలాబాద్ జిల్లా నుంచి మంత్రిగా ఉన్న జోగు రామన్నకు ఈసారి కూడా అవకాశం దక్కలేదు. ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

నిజామాబాద్ జిల్లా నుంచి : 01 (వేముల ప్రశాంత్ రెడ్డి)

నిజామాబాద్ జిల్లా నుంచి వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. గతంలో మంత్రిగా పని చేసిన పోచారం శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం స్పీకర్ గా వ్యవహరిస్తున్నారు. వేముల బాల్కొండ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

హైదరాబాద్ జిల్లా నుంచి : 03 (తలసాని శ్రీనివాసయాదవ్, మహమూద్ అలీ, చామకూర మల్లారెడ్డి)

ఇక హైదరాబాద్ జిల్లా నుంచి గతంలో డిప్యూటీ సీఎంగా ఉన్న మహమూద్ అలీ కెసిఆర్ తో పాటే మంత్రిగా ప్రమాణం చేశారు. ఆతర్వాత మంత్రివర్గ విస్తరణలో తలసాని, చామకూర మల్లారెడ్డిలు స్థానాలు దక్కించుకున్నారు. మహమూద్ అలీ ఎమ్మెల్సీగా ఉన్నారు. తలసాని సనత్ నగర్ నుంచి, చామకూర మేడ్చల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

రంగారెడ్డి జిల్లా నుంచి : 01 (సబిత ఇంద్రారెడ్డి)

రంగారెడ్డి జిల్లా నుంచి తాజాగా సబితా ఇంద్రారెడ్డి ఒక్కరికే అవకాశం దక్కింది. గతంలో మంత్రిగా ఉన్న మహేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోవడం...ఆతర్వాత మంత్రివర్గంలో ఎవ్వరికీ అవకాశం రాలేదు. సబిత మహేశ్వరం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

వరంగల్ జిల్లా నుంచి: 02 (ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్)

వరంగల్ జిల్లా నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు మొదటి మంత్రి వర్గ విస్తరణలోనూ, సత్యవతి రాథోడ్ ఈ సారి తాజాగా మంత్రులుగా అవకాశాలు దక్కించుకున్నారు. అయితే ఎర్రబెల్లి పాలకుర్తి నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా, సత్యవతి ఎమ్మెల్సీగా ఉన్నారు. గతంలో కడియం డిప్యూటీ సీఎంగా, చందూలాల్ మంత్రిగా ఉన్నారు.

మహబూబ్ నగర్ జిల్లా నుంచి : 02 (సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస గౌడ్)

మహబూబ్ నగర్ జిల్లా నుంచి సింగిరెడ్డి నిరరంజన్ రెడ్డి, శ్రీనివాసగౌడ్ లు రెండో మంత్రివర్గ విస్తరణలో అవకాశాలు దక్కించుకున్నారు. గతంలో మంత్రిగా ఉన్న జూపల్లి కొల్లాపూర్ లో ఓడిపోగా, జడ్చర్ల నుంచి గెలిచిన లక్ష్మారెడ్డికి అవకాశాలు దక్కలేదు.

నల్లగొండ జిల్లా నుంచి: 01 (గుంటకండ్ల జగదీశ్ రెడ్డి)

నల్లగొండ జిల్లా నుంచి గతంలో మంత్రిగా ఉన్న గుంటకండ్ల గజదీశ్ రెడ్డి తాజగా మంత్రివర్గంలో రెండో విస్తరణలోనే చోటు దక్కించుకున్నారు. కొనసాగుతున్నారు.

ఖమ్మం జిల్లా నుంచి: 01 (పువ్వాడ అజయ్ కుమార్)

ఇక ఖమ్మం నుంచి తాజాగా పువ్వాడ అజయ్ కుమార్ మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు. రెండోసారి ఖమ్మం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories