PM Modi: తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తే తీవ్ర పరిణామాలుంటాయి..

BJP Cares for the People of Telangana Says PM Modi
x

PM Modi: తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తే తీవ్ర పరిణామాలుంటాయి..

Highlights

PM Modi: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేశారు.

PM Modi: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ కమల వికాసం స్పష్టంగా కనిపిస్తోందన్నారు మోడీ హైదరాబాద్‌ బేగంపేట ఎయిర్‌పోర్టులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం మొత్తాన్ని మునుగోడుకు తీసుకొచ్చారని ఆరోపించారు.

ఇక్కడి ప్రజలు బీజేపీని అక్కున చేర్చుకుని ఆదరిస్తున్నారని, 1984లో కేవలం రెండు ఎంపీ సీట్లు మాత్రమే ఉన్నాయన్నారు. తెలంగాణలో కుటుంబ పాలన పోయి బీజేపీ ప్రభుత్వం రావాలన్నారు మోడీ అవినీతి కుటుంబ పాలన ప్రజాస్వామ్యానికి మొదటి శత్రువులని మోడీ అన్నారు. ఈ విషయాన్ని ఎర్రకోట నుంచి చెప్పానన్నారు. హైదరాబాద్ ఐటీ రంగానికి కంచుకోట అని...ఐటీ కారిడార్‌లో టీఆర్ఎస్ మూఢనమ్మకాలను పెంచి పోషిస్తోందని ఆరోపించారు. మూఢనమ్మకాలు అభివృద్ధికి గొడ్డలిపెట్టులాంటిదన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కొన్ని దుష్టశక్తులు ఏకమయ్యాయని మోడీ దుయ్యబట్టారు. అవినీతిని కూకటివేళ్లతో పెకిలించడానికి సిద్ధంగా ఉన్నామన్నారాయన పేదలను దోచుకునే అవినీతిపరులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు మోడీ.

ప్రజల కోసం పనిచేసే బీజేపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని మోడీ అభిలషించారు. కొందరు భయంతో నిరాశతో తనను బూతులు తిడుతున్నారని ఆరోపించారు బీజేపీ కార్యకర్తలెవరూ ఆందోళన చెందవద్దన్నారు. 22 ఏళ్ల నుంచి ఎన్నో తిట్లు తింటున్నానని తనకు అలసట లేదని ప్రతి రోజు 3 కిలోల తిట్లు తింటానన్నారు మోడీ ఆ తిట్లను తానెప్పుడూ పట్టించుకోలేదన్నారాయన తనను తిడితేనే రైతులు బాగుపడతారనుకుంటే అలాగే కానివ్వండని అన్నారు మోడీ పసుపు రైతులను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు ప్రధాని. తెలంగాణ ప్రజలు తనపై చూపిన ప్రేమను వడ్డీతో సహా చెల్లిస్తానని అన్నారు మోడీ తెలంగాణ హైదరాబాద్ అంటే తనకెంతో ఇష్టమనరాయన తెలంగాణ ప్రజల ఆకాంక్షలతో అడ్డుకుంటే ప్రతిఘటన తప్పదన్నారు ప్రధాని తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories