Bhadradri: భద్రాద్రి రామయ్యకు డోలోత్సవం..ఏప్రిల్ 17న కల్యాణానికి భారీ ఏర్పాట్లు

Bhadradri Ramayya Kalyanam 2024 Updates
x

Bhadradri : భద్రాద్రి రామయ్యకు డోలోత్సవం..ఏప్రిల్ 17న కల్యాణానికి భారీ ఏర్పాట్లు

Highlights

Bhadradri: స్వామి కల్యాణానికి శాస్త్రోక్తంగా పనులు ప్రారంభం

Bhadradri: భద్రాద్రి రామయ్యకు హొలీ పౌర్ణమిని పురస్కరించుకుని డోలోత్సవం, వసంతోత్సవం ఘనంగా నిర్వహించారు. ఏప్రిల్ 9 నుండి శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండగా ఏప్రిల్ 17వ తేదీ సీతారాముల కల్యాణం,18 న శ్రీరామ పట్టాభిషేకం జరగనున్నాయి. అయితే హోలీ పౌర్ణమి పురస్కరించుకుని శ్రీసీతారామచంద్ర స్వామివారిని సుందరంగా అలంకరించిన ఊయలలో ఆశీనులను చేసి,వేద మంత్రోచ్చారణల మధ్య,ఆస్థాన సంగీత విద్వాంసుల జోలపాటల నడుమ, డోలోత్సవం, వసంతోత్సవం నిర్వహించారు. వసంతోత్సవం జరిగిన రోజు రామయ్యను పెళ్ళికొడుకును చేసినట్లుగా భక్తులు భావిస్తారు.

ఏప్రిల్ 17వ తేదీన జరిగే శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణానికి శాస్త్రోక్తంగా అధికారికంగా పనులు ప్రారంభించారు. ఉదయం పసుపుకొమ్ములు దంచిన మహిళలు అనంతరం తలంబ్రాలను కలిపారు.హొలీ పౌర్ణమి సందర్భంగా సహస్రధారణ,ప్రత్యేక స్నపనం నిర్వహించారు. బేడా మండపంలో ఉత్సవమూర్తులకు వసంతాలను శాస్త్రోక్తంగా చల్లి ప్రత్యేకపూజలు నిర్వహించారు. భక్తులు ఒకరిపై ఒకరు వసంతాలను చల్లుకున్నారు .రామనామస్మరణతో ఆలయం మారుమ్రోగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories