2020 కేటీఆర్‌కు అత్యంత కీలకమైన సంవత్సరమా.. సీఎంగా పట్టాభిషేకం జరగబోతోందా?

2020 కేటీఆర్‌కు అత్యంత కీలకమైన సంవత్సరమా.. సీఎంగా పట్టాభిషేకం జరగబోతోందా?
x
Highlights

2020లో టిఆర్ఎస్ టార్గెట్ ఎంటీ ? కేటిఆర్‌ను ముఖ్యమంత్రిని చేయడమే కేసీఆర్ లక్ష్యమా? కొత్తేడాది తారక రాముడికి పట్టాభిషేకమేనా? అంటే అవుననే సమాధానం...

2020లో టిఆర్ఎస్ టార్గెట్ ఎంటీ ? కేటిఆర్‌ను ముఖ్యమంత్రిని చేయడమే కేసీఆర్ లక్ష్యమా? కొత్తేడాది తారక రాముడికి పట్టాభిషేకమేనా? అంటే అవుననే సమాధానం వినపడుతోంది పార్టీలో. కుమారుడికి పాలనాపగ్గాలు అప్పగిచ్చేందుకు, కేసీఆర్‌ అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. నిజంగా 2020లో తెలంగాణ కొత్త సీఎంను చూడబోతోందా?

కేటీఆర్. కల్వకుంట్ల తారక రామారావు. ఐటీ శాఖామంత్రి. టీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్. టీఆర్ఎస్‌లో కేసీఆర్‌ తర్వాత కేటీఆరే అన్నది, పార్టీ వర్గాల మాట. అయితే, 2020 కేటీఆర్‌కు అత్యంత ముఖ్యమైన సంవత్సరంగా పార్టీ నేతలు చెబుతున్నారు.

2020, తెలంగాణ రాష్ట్ర సమితిలో పెను మార్పులకు కారణమవుతుందన్న అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. 2019 కన్నా 2020లో మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలనే ఆలోచనతో ఉన్న ముఖ్యమంత్రి కేసిఆర్, ముఖ్యమంగా తన కుమారుడు కేటీఆర్‌‌కు పట్టాభిషేకం చేస్తారన్న ఊహాగానాలు అంతకంతకు పెరుగుతున్నాయి. 2020 కేటీఆర్ నామ సంవత్సరమని, కొందరు టీఆర్ఎస్‌ నేతలంటున్నారు. మొన్న మంత్రి శ్రీనివాస గౌడ్‌ చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం.

గత కొన్ని రోజులుగా కేసిఆర్ తనయుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్‌ను సీఎంను చేయాలనే డిమాండ్, పార్టీలో రోజురోజుకు పెరుగుతోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తరువాత కేటిఆర్ పార్టీ కార్యకలాపాలు చూసుకుంటూ వస్తున్నారు. దీంతో పాటు 2019లో కేటిఆర్ అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికలు జరగడం, ఆ ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీ రావడం, అదంతా కూడా కేటిఆర్ క్రెడిట్ అంటూ పార్టీలో చెప్పుకున్నారు. అలాగే టీపిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం, హుజూర్‌ నగర్‌‌కు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా గులాబీ జెండా ఎగిరింది. ఇవన్నీ కూడా కేటిఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తరువాత జరిగిన ఎన్నికలు. ఇలా వరుస విజయాల ఘనత కేటీఆర్‌కే అంటూ, పార్టీలో కొందరు నాయకులు మాట్లాడుతున్నారు. అందుకే‌ కేటిఆర్‌ను సీఎం చెయ్యాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు.

కొత్త సంవత్సరం ప్రారంభంలోనే జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలకు కూడా, కేటిఆర్ నాయత్వంలో ముందుకు వెళ్తోంది టీఆర్‌ఎస్. ఈ ఎన్నికల్లో సైతం మొత్తం మున్సిపాలిటిలు ,కార్పొరేషన్లను, కైవసం చేసుకుంటామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు కేటిఆర్. మున్సిపల్‌ ఎన్నికల తరువాత కేటిఆర్‌ను సీఎం చెయ్యడం ఖాయమన్న ఊహాగానాలు టీఆర్ఎస్‌లో జోరుగా వినిపిస్తున్నాయి. అయితే పార్టీలో కొందరు అసంతృప్తిగా వున్నట్టు తెలుస్తోంది. వాళ్లందర్నీ బుజ్జగించేందుకు కేసిఆర్ తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వాళ్లను దగ్గరకు తీసుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. సో వాళ్లందర్నీ దారిలోకి తెచ్చుకుంటే, ఇక కేటీఆర్‌కు లైన్‌ క్లియరైనట్టేనని టీఆర్ఎస్‌ వర్గాలంటున్నాయి. అటు మున్సిపల్ ఎన్నికలు, అలాగే సీఎంగా పట్టాభిషేకం ఊహాగానాల నేపథ్యంలో, కేటీఆర్‌కు 2020 అత్యంత కీలకమైన సంవత్సరంగా చర్చ జరుగుతోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories