EC Rajat Kumar

మద్యం సేవించి వస్తే కఠిన చర్యలు: రజత్‌కుమార్‌ 

Submitted by chandram on Thu, 12/06/2018 - 18:07

ఎన్నికల సమయానికి ఇంకా కొన్ని గంటలే మిగిలాయి. అయితే పోలింగ్ బూత్ వద్ద ఎలా వ్యవహరించాలో తెలంగాణ ఈసీ రజత్ కుమార్ తెలిపారు. ‌ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్ వద్దకు సెల్ ఫోన్స్, కెమెరాలు నిషేధించామని, అలాగే మందు బాబులు మధ్యం సేవించి పోలింగ్ బూత్ వద్దకు వస్తే కఠినమైన చర్యలు తప్పవని హెచ్చిరించారు, అలాగే ఎన్నికల నేపథ్యంలో ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని వృద్దులకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో ప్రతి ఏటా పోలింగ్ శాతం 55 కంటే ఎక్కవ లేనేలేదని, ఈసారి మాత్రం ఏడున్నర లక్షల మంది మొదటి సారి ఓటు వేస్తున్నారని తెలిపారు.

కొడంగల్ లో ఐటీ శాఖ సోదాలు...పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం

Submitted by arun on Thu, 11/29/2018 - 10:33

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. ఇదే సమయంలో డబ్బు ప్రవాహం పెరుగుతోంది. తాజాగా కొడంగల్ లో ఐటీ శాఖ నిర్వహించిన సోదాల్లో భారీ మొత్తంలో నగదు పట్టుబడటం కలకలం రేపుతోంది. పట్టుబడ్డ నగదు వ్యవహారంపై ఈసీ ఆరా తీసింది. అయితే డబ్బు ఎవరిది ఎవరి ద్వారా వచ్చింది అనే అంశాలపై  ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకున్నది. 

తెలంగాణలో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్

Submitted by arun on Fri, 09/28/2018 - 12:06

తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని స్పష్టం చేశారు ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్. నిన్నటి నుంచే ఎన్నిక మోడల్ కోడ్ కిందికి వస్తుందన్నారు. అసెంబ్లీ రద్దు తర్వాత ఆపద్ధర్మ ప్రభుత్వాలున్నచోట్ల ఎలాంటి కొత్త పథకాలు ప్రవేశపెట్టకూడదని చెప్పారు. ఇప్పటివరకూ 15లక్షల45వేల 520 ఓట్ల అభ్యంతరాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. 15రోజుల్లో 13లక్షల 15వేల 234 కొత్త అభ్యంతరాలు వచ్చినట్టు తెలిపారు. బతుకమ్మ చీరలు, రైతు బంధు వంటివి కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు రజత్‌కుమార్.