KTR

తెలంగాణలో ఇంటింటికీ బ్రాడ్ బ్యాండ్ సౌకర్యం: కేటీఆర్

Submitted by arun on Mon, 02/19/2018 - 12:27

తెలంగాణలో ఇంటింటికీ బ్రాడ్ బ్యాండ్ సౌకర్యం కల్పిస్తున్నామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. వరల్డ్ ఐటీ కాంగ్రెస్ సదస్సులో పాల్గొన్న కేటీఆర్.. టీ ఫైబర్ గ్రిడ్ పథకం టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్ నెట్‌వర్క్.. టీడీఎన్ ను కేటీఆర్ ప్రారంభించారు. ఫైబర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికి ప్రభుత్వ పథకాలను చేరవేస్తామని అన్నారు. వరల్డ్ ఐటీ కాంగ్రెస్ సదస్సు హైదరాబాద్ వేదికగా జరగడం తెలంగాణకు గర్వకారణమని మంత్రి అన్నారు.

‘కుట్ర అని సెర్చ్‌ చేస్తే కేటీఆర్‌ ఫొటో వస్తోంది’

Submitted by arun on Mon, 02/12/2018 - 11:38

గూగుల్‌ సెర్చ్‌లో తెలుగులో 'కుట్ర' అని టైప్‌ చేస్తే మంత్రి కేటీఆర్‌ ఫొటోలు వస్తున్నాయని, కుట్రకు పర్యాయపదంగా కేటీఆర్‌ నిలిచారని టీ.కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్‌ విమర్శించారు. మోదీతో టీఆర్‌ఎస్‌ పార్టీ లోపాయికారీ ఒప్పందాన్ని కుదుర్చుకుందని, అందుకే పార్లమెంట్‌లో మోదీ కాంగ్రెస్ విమర్శించగానే.. రాష్ట్రంలో మంత్రి కేటీఆర్‌ చిట్‌చాట్‌ పేరుతో కాంగ్రెస్ పై అవాకులు, చవాకులు మాట్లాడారని దుయ్యబట్టారు. మరుసటి రోజు పత్రికల్లో వచ్చిన ఆ వార్తల క్లిప్పింగ్‌లను మోదీకి చేరవేసేందుకు ట్విటర్‌లో పోస్టు చేసి రాజకీయ కుట్రకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఐటీ మంత్రికి ట్విట్టర్‌లో పంచ్‌

Submitted by arun on Mon, 02/12/2018 - 09:10

ఐటీ మంత్రికే ట్విట్టర్‌లో పంచ్‌ పడింది. ఓ సినిమా గురించి ట్వీట్‌ చేసినందుకు నెటిజన్లు కౌంటర్‌ ఇచ్చారు. రైతులు, విద్యార్థుల కష్టాలు పట్టించుకోకుండా సినిమాలు చూడ్డమేంటని ట్విట్టర్‌లో ప్రశ్నించారు. నెటిజన్ల ప్రశ్నలతో చిర్రెత్తుకొచ్చిన ఆ మంత్రి వెంటనే తన డీపీ మార్చేశారు. కేటీఆర్‌... తెలంగాణ ఐటీ శాఖా మంత్రి. ట్విట్టర్‌లో బాగా యాక్టీవ్‌గా ఉంటారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించడమేకాదు, అధికారులను అలర్ట్‌ చేస్తూ ట్వీట్స్‌ చేస్తుంటారు.

యాంకర్ ప్రదీప్ ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ రీట్వీట్..

Submitted by arun on Sat, 02/10/2018 - 10:47

ఇటీవల డ్రంకన్ డ్రైవ్ కేసులో పట్టుబడి వార్తల్లోకెక్కిన యాంకర్ ప్రదీప్.. తన మంచి మనసు చాటుకున్నాడు. స్కూళ్లలో చదువుకుంటున్న విద్యార్థులు, ముఖ్యంగా అమ్మాయిలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని కేటీఆర్‌కు ఒక అభ్యర్థన పెట్టాడు. ఈ అంశంపై స్పందించిన కేటీఆర్.. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని మేడ్చల్ కలెక్టర్‌కు సూచించారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సమస్యలను పరిష్కరించి తనకు తెలియజేయాలని కలెక్టర్‌కు మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. చర్లపల్లి ప్రాథమిక పాఠ‌శాల‌లో బాత్రూమ్ లేదని, మంచి నీటి సౌకర్యం లేదని యాంకర్ ప్రదీప్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.

లోఫర్‌ లొల్లి

Submitted by arun on Fri, 02/09/2018 - 13:23

తెలంగాణలో రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయ్. ఎన్నికలకు ఇంకా ఏడాదికిపైగా సమమున్నప్పటికీ అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయ్. మంత్రి కేటీఆర్ కాంగ్రెస్‌ని లోఫర్ పార్టీ అన్నారు. ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ నేతలు అంతే ధీటుగా కౌంటరిచ్చారు.

గూగుల్‌లో కేటీఆర్ అని కొడితే.. దోపిడీ దొంగ అని వస్తోంది: కోమటిరెడ్డి

Submitted by arun on Thu, 02/08/2018 - 15:45

అహంకారం, అధికార మదమెక్కి కేటీఆర్ మాట్లాడుతున్నారని.. కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి మంత్రి కేటీఆర్ పై మండిపడ్డారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్.. లోఫర్ పార్టీగా కనిపిస్తుందా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసిన కోమటిరెడ్డి.. గూగుల్‌లో కేటీఆర్ అని కొడితే.. దోపిడీ దొంగ అని వస్తుందన్నారు. మిషన్‌ భగీరథలో సగం కాంట్రాక్టులు కేటీఆర్‌కు చెందినవేనని.. దోచుకున్న డబ్బును దాచుకునేందుకే తరచూ విదేశాలకు వెళ్తున్నారన్నారు. సీఎం కేసీఆర్‌ చేతగానితనం వల్లే బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు.
 

'మంత్రి పదవి ఆఫర్‌ చేశారు.. ఫుటేజీ బయటపెడతా'

Submitted by arun on Thu, 02/08/2018 - 14:24

2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కాంగ్రెస్ ఓడిపోతే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటారా అన్న మంత్రి కేటీఆర్ సవాల్‌పై ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. ఉత్తమ్‌తో మాట్లాడానని కేటీఆర్ సవాల్‌ను స్వీకరిస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపోతే ఉత్తమ్‌తోపాటు తానూ రాజకీయ సన్యాసం తీసుకుంటానని కోమటిరెడ్డి సవాల్ విసిరారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. మిషన్‌ భగీరథలో సగం కాంట్రాక్టులు కేటీఆర్‌కు చెందినవేనని.. దోచుకున్న డబ్బును దాచుకునేందుకే తరచూ విదేశాలకు వెళ్తున్నారన్నారు.

కుతకుత‌లాడుతున్న ప‌ప్పు

Submitted by lakshman on Thu, 02/08/2018 - 03:44

తెలంగాణ ఐటీ మినిస్ట‌ర్ కేటీఆర్ మ‌రోసారి ప్ర‌స్తావ‌న తెచ్చారు.  రాహుల్ గాంధీని ప‌ప్పుతో పోల్చుతూ ఆయ‌న‌కంటే పెద్ద ప‌ప్పూ మ‌ర‌వెరు లేంటూ ఎద్దేవా చేశారు.