PM Modi

బీజేపీని తక్కువ అంచనా వేయొద్దు: కె.లక్ష్మణ్

Submitted by chandram on Fri, 11/30/2018 - 20:11

వచ్చేనెలలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అంత తక్కువ అంచనా వేయద్దని, ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామని టీ-బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. బీజేపీ పార్టీని ఎవరు ఎన్ని విమర్శుల చేసిన కాని అంతగా పట్టించుకొము ఎందుకంటే డిసెంబర్ 7 తారీకునా తమ సత్తాఎంటో ఆ రోజు బయటపడుతుందని వెల్లడించారు. కాగా డిసెంబర్ 3న ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున నిర్వహించిన బోతున్నా బీజేపీ భారీ బహిరంగ సభకు భారతదేశ ప్రదాని నరేంద్రమోడీ హాజరుకానున్నా నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను లక్ష్మణ్, పోలీసులు, ఎస్పీజీ అధికారులు పరిశీలించారు.

రేపు తెలంగాణలో మోడీ పర్యటన

Submitted by chandram on Mon, 11/26/2018 - 17:16

తెలంగాణలో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ప్రధాని మోడీ రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 11 గంటల 50 నిమిషాలకు నిజామాబాద్‌ చేరుకోనున్న మోడీ అక్కడ జరగనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం మహబూబ్‌నగర్‌లో జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసిన కమలనాథులు భారీగా జనసమీకరణకు ప్రయత్నిస్తున్నారు. సమయం మించిపోతోంది. త్వరపడండి, అంటూ తెలంగాణ ఎన్నికల్లో రాష్ట్ర స్థాయి నేతలు కోరుతుంటే జాతీయ నేతలు టూర్ షెడ్యూల్ వేసుకొని వాలిపోతున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కమలదళం మరింత స్పీడు పెంచేందుకు జాతీయ నాయకులను ప్రచారంలోకి దింపుతోంది.

ఆయన సేవలు అనంతం... అనంతకుమార్‌ కు ప్రముఖుల నివాళి

Submitted by arun on Mon, 11/12/2018 - 13:51

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి అనంత్ కుమార్  కన్నుమూశారు.  గత కొంత కాలంగా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం వేకువజామున తుదిశ్వాస విడిచారు.  అనంతకుమార్ మృతిపట్ల రాష్ట్రపతి, ప్రధాని తమ ప్రగాడ సానుభూతి తెలిపారు. 
 

ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు లేఖ

Submitted by arun on Sat, 10/13/2018 - 13:05

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో టిట్లీ తుఫానుతో నెలకొన్న నష్టంపై ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తుఫాన్‌తో తీవ్ర నష్టం జరిగిందని, రెండు జిల్లాల్లో 2 వేల 800 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు లేఖలో పేర్కొన్నారు. తక్షణమే 12వందల కోట్లు ఇవ్వాలని లేఖలో సీఎం కోరారు. టిట్లీ తుఫాన్‌ ఉధృతికి ఇళ్లు, రహదారులు దెబ్బతిన్నాయని, హార్టీకల్చర్‌కు వెయ్యి కోట్ల నష్టం చేకూరిందని, అలాగే ఇతర పంటలు 8వందల కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలిపారు.

ఇద్దరిదీ మోసమే..

Submitted by arun on Tue, 08/14/2018 - 10:38

తెలంగాణ టూర్ లో రాహుల్ అటు కేంద్రాన్ని, ఇటు రాష్ట్రాన్ని కడిగేశారు. అటు మోడీ, కేసిఆర్  వ్యవహార శైలిపై చురకలేశారు. మహిళలు లేనిదే పురోగతి సాధ్యం కాదన్న రాహుల్ డబల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తానని కేసీఆర్ మోసం చేశాడన్నారు. 

పవన్ ఎక్కడ?

Submitted by arun on Sat, 07/21/2018 - 11:07

బీజేపీ వంత పాడుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలను దెబ్బ తీస్తోన్నవారికి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. లోక్‌‌సభలో ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడిన తీరు బాధ కలిగించిందన్న చంద్రబాబు అధికారముందన్న అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈరోజు ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు ఎన్డీఏ సర్కార్‌ చేస్తోన్న ద్రోహాన్ని మొత్తం దేశం దృష్టికి తీసుకెళ్తామన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

చంద్రబాబు, కేసీఆర్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన మోడీ

Submitted by arun on Sat, 07/21/2018 - 10:23

అవిశ్వాసంపై చర్చ సందర్భంగా రాష్ట్ర విభజన, టీఆర్‌ఎస్, టీడీపీ ప్రభుత్వాల తీరుపై మోడీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌‌పై మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. విభజన సమస్యల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం ఎంతో పరిణతితో వ్యవహరించిందన్నారు. చంద్రబాబు, కేసీఆర్ మధ్య అనేకసార్లు సయోధ్య కుదిర్చినట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు.

పీఎం మోడీని కాల్చేయాలంటూ క‌త్తి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..?

Submitted by lakshman on Wed, 04/11/2018 - 13:11

క్రిటిక్ క‌త్తిమ‌హేష్ పీఎం మోడీపై విరుచుకుపడ్డారు. గ‌తంలో జగన్ అక్రమాస్తుల కేసులో పీఎం మోడీ పేరు బయటకు వచ్చింది. దీంతో క‌త్తి మోడీని విమ‌ర్శిస్తూ ములిగేనక్క మీద తాటికాయ పడటం అంటే ఇదేనంటూ సెటైర్లు వేశారు. ఇప్పుడు నోట్ల రద్దు వ్యవహారంతో ఎంతోమంది అమాయకులు బలైపోయారని అన్నారు. ఈ పరిస్థితికి కారణమైన నరేంద్ర మోడీని నడిరోడ్డుపై కాల్చేయాలని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.

మోదీకి మరో బీజేపీ ఎంపీ షాక్‌

Submitted by arun on Sat, 04/07/2018 - 15:40

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉత్తర ప్రదేశ్‌కు చెందిన మరో దళిత ఎంపీ యశ్వంత్ సింగ్ ఊహించని షాక్ ఇచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గత నాలుగేళ్లలో దళితుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం చూపిందంటూ నిలదీశారు. నాగిన నియోజవర్గం నుంచి లోక్‌సభ ఎంపీగా కొనసాగుతున్న యశ్వంత్.. కేవలం రిజర్వేషన్ కారణంగానే తాను ఎంపీనయ్యానన్నారు. ‘‘ఒక దళితుడిగా నా సామర్ధ్యాన్ని ఏమాత్రం ఉపయోగించుకోవడం లేదు. నేను కేవలం రిజర్వేషన్ కారణంగానే పార్లమెంటు సభ్యుడిని కాగలిగాను. దేశంలోని 30 కోట్ల మంది దళితులకు గత నాలుగేళ్లలో కేంద్రప్రభుత్వం చేసింది శూన్యం...’’ అంటూ తన లేఖలో ధ్వజమెత్తారు.

బీజేపీకి అధికార పిచ్చి అంటూ కీలక నేత రాజీనామా

Submitted by lakshman on Thu, 03/22/2018 - 09:55

మనసు చంపుకుని ఇక పార్టీలో పని చేయలేనంటూ ఓ కీలక నేత పదవి వదిలేశారు. అసలే ఏపీ ఎంపీలు చేస్తున్న రచ్చతో జనంలో దేశవ్యాప్తంగా పరువు పోగొట్టుకున్న బీజేపీ ఇప్పుడు ఈ పరిణామంతో దిమ్మెరపోయింది. బీజేపీ ఐటీ సెల్ వ్యవస్థాపకుడు ప్రద్యుత్ బోరా బుధవారం పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. పార్టీ జాతీయ కార్యవర్గ కమిటీకి, ప్రాథమిక సభ్యుత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.