Dharmabad Court

ధర్మాబాద్ కోర్టుకు వెళ్లకూడదని చంద్రబాబు నిర్ణయం

Submitted by arun on Sat, 10/06/2018 - 14:05

బాబ్లీ ప్రాజెక్టు కేసులో ధర్మాబాద్‌ కోర్టుకు హాజరుకారాదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో రీకాల్ పిటిషన్ వేయాలని సీఎం యోచిస్తున్నారు. ధర్మాబాద్ కోర్టుకి హాజరయ్యే అంశం పై సీఎం చంద్రబాబు మంత్రులు కళా వెంకట్రావు,యనమల, అచ్చెన్నాయుడు, నారాయణ, నక్కా ఆనంద్, అమర్నాథ్ రెడ్డి, ఎంపీ కనకమేడల రవీంద్రబాబుతో పాటు అడ్వకేట్ జనరల్ తో మంతనాలు జరిపారు. బాబ్లీ కేసు  కేసు విషయంలో ధర్మాబాద్ కోర్టు జారీ చేసిన నాన్ బెయిల బుల్ అరెస్ట్ వారెంట్ ప్రకారం న్యాయస్థానానికి  హాజరు కావాలా లేదా అనే చర్చించారు.

బాబ్లీ వివాదంలో రీకాల్ పిటిషన్‌పై ధర్మాబాద్ కోర్టు సంచలన తీర్పు

Submitted by arun on Fri, 09/21/2018 - 13:14

బాబ్లీ కేసులో రీకాల్ పిటిషన్‌పై ధర్మాబాద్ కోర్టు సంచలన తీర్పు ప్రకటించింది. బాబ్లీ కేసులో చంద్రబాబు కోర్టుకు హాజరు కావాల్సిందేనని ధర్మాబాద్ న్యాయమూర్తి స్పష్టం చేశారు. వచ్చే నెల 15న చంద్రబాబుతో సహా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు అందుకున్న వారంతా హాజరు కావాల్సిందేనని  ధర్మాబాద్ కోర్టు తేల్చి చెప్పింది. చంద్రబాబు తరుఫు లాయర్లు కొంత సమయం కోరగా ఎవరికీ స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇవ్వలేమన్న జడ్జి తదుపరి విచారణ అక్టోబర్‌ 15కు వాయిదా వేశారు.

మహారాష్ట్ర ధర్మాబాద్‌లో టెన్షన్‌...తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

Submitted by arun on Fri, 09/21/2018 - 10:21

మహారాష్ట్ర ధర్మాబాద్‌లో హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. బాబ్లీ వ్యతిరేక పోరాట కేసులో ఏపీ సీఎం చంద్రబాబుతో సహా 16మందికి ధర్మాబాద్‌ కోర్టు జారీ చేసిన నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌పై ఈరోజు విచారణ జరగనుంది. దాంతో ఈ కేసుపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కోర్టు వారెంట్‌పై చంద్రబాబు రీకాల్‌ పిటిషన్‌ దాఖలు చేయాలని నిర్ణయం తీసుకోవడంతో న్యాయస్థానం ఎలా స్పందింస్తుందోనన్న టెన్షన్‌ నెలకొంది. 

ధర్మాబాద్ కోర్టు నోటీసులపై చంద్రబాబు కీలకనిర్ణయం

Submitted by arun on Wed, 09/19/2018 - 14:17

బాబ్లీ ఆందోళన విష‍యంలో ఏపీ సీఎంకు జారీ అయిన నాన్‌బెయిలబుల్ నోటీస్ వ్యవహారంపై చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం తన తరపున న్యాయవాదిని పంపాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఎఫ్‌ఐఆర్‌, చార్జ్‌షీట్ ఆధారంగా నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను రీకాల్ చేయాలని బాబు తరపు న్యాయవాది కోరునున్నారు. ఈ నెల 21న ఈ కేసు విచారణకు రానుంది.  ఇదే విషయంపై నిన్న ఏపీ పోలీసు ఉన్నతాధికారులతో నాందేడ్‌ ఎస్పీ ఫోన్‌‌లో సంభాషించారు. చంద్రబాబుకు నాన్‌బెయిలబుల్‌ వారెంట్ ఉందని లేఖ పంపుతున్నామని, లేఖతో పాటు వారెంట్ కూడా పంపుతున్నామని నాందేడ్‌ ఎస్పీ సమాచారం అందించారు.