Top Stories

ఆ 39 మంది భారతీయులు చనిపోయారు

Submitted by arun on Tue, 03/20/2018 - 12:27

ఇరాక్‌లో భారతీయుల కిడ్నాప్‌ ఘటన విషాదాంతమైంది. నాలుగేళ్ల క్రితం ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు బందీలుగా చేసుకున్న ఆ 39 మంది భారతీయులు మృతిచెందినట్లు కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ మంగళవారం రాజ్యసభలో వెల్లడించారు. 2014లో ఇరాక్‌లో కిడ్నాప్ అయిన 39 మంది భారతీయల ఆచూకీ కోసం భారత్ చేయని ప్రయత్నం అంటూ లేదు. అయితే వారందరినీ  ఐఎస్ ఉగ్రవాదులు  పొట్టనపెట్టుకున్నారని సుష్మ ప్రకటించారు.
 

ఆగని ఆందోళనలు.. లోక్‌సభ వాయిదా

Submitted by arun on Tue, 03/20/2018 - 11:43

సేమ్ సీన్. నిన్నటికి ఇవాల్టికి తేడా ఏమీ లేదు. లోక్‌సభలో పరిస్థితి ఏమాత్రం మారలేదు. సభ ప్రారంభం కావడం అవి‌శ్వాస తీర్మానంపై చర్చ చేపట్టాలని టీడీపీ, వైసీపీ పట్టు పట్టడం పోడియంలో అన్నాడీఎంకే, టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనకు దిగడం సభ గంట పాటు వాయిదా పడడం ఇవాళ కూడా యాధావిధిగా జరిగిపోయింది.

రణరంగంగా ముంబై

Submitted by arun on Tue, 03/20/2018 - 11:19

ముంబై మళ్లీ హోరెత్తుతోంది. నినాదాలతో దద్దరిళ్లుతోంది. మొన్నటివరకు రైతుల ఆందోళనలతో అట్టుడికిన ముంబై మహానగరం తాజాగా రైల్వే ఉద్యోగాల కోసం పోరాడుతున్న నిరుద్యోగుల ఆందోళనతో అట్టుడికిపోతోంది. రైల్వే పోస్టుల కోసం పరీక్షలు రాసిన అభ్యర్థులు నియామకాలు కోరుతూ ఇవాళ భారీ ఆందోళనను చేపట్టారు. మతుంగ, ఛత్రపతి శివాజీ టెర్మినల్ల మధ్య భారీ నిరసనకు దిగడంతో రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రైలు పట్టాలపైనే నిరసన చేపట్టడంతో 60 కి పైగా లోకల్ రైళ్లను అధికారులు రద్దు చేశారు. 

లాలూ ప్రసాద్ కు మరో ఎదురు దెబ్బ

Submitted by arun on Mon, 03/19/2018 - 15:07

ఆర‌్జేడీ అధినేత లాలూ ప్రసాద్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. దాణా కుంభకోణ వ్యవహారంలో ఆయనపై నమోదైన నాలుగో కేసులో కూడా లాలూ ను దోషిగా నిర్ధారిస్తూ రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. డుంకాలో జరిగిన దాణా కోనుగోలు వ్యవహారంలో 3 కోట్ల మేర అవినీతి జరిగిందంటూ న్యాయస్ధానం నిర్ధారించింది. ఇప్పటికే  లాలూను మూడు కేసుల్లో దోషిగా న్యాయస్ధానం తీర్పునివ్వడంతో   జార్ఖండ్ లోని బిశ్రాముండా జైలులో శి‍‍క్ష అనుభవిస్తున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ ను నిన్ననే ఆనారోగ్యానికి గురి కావడంతో  స్ధానిక రిమ్స్ కు తరలించి చికిత్సనందిస్తున్నారు.

అవిశ్వాస నోటీసులు తిరస్కరించిన స్పీకర్‌

Submitted by arun on Mon, 03/19/2018 - 12:36

కేంద్రంపై తెదేపా, వైకాపా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలను లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ తిరస్కరించారు.  సభ సజావుగా సాగనందువల్లే నోటీసులు తిరస్కరిస్తున్నట్లు స్పీకర్‌ స్పష్టం చేశారు. సభ నిర్వహణ సక్రమంగా సాగకపోతే నోటీసులు స్వీకరించలేమన్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే తెరాస, అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన చేయడంతో సభ 12 గంటలకు వాయిదా పడింది. గంట తర్వాత సభ ప్రారంభమయ్యాకా అదే పరిస్థితి నెలకొంది. కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే, రిజర్వేషన్ల పెంపు అంశంపై తెరాస సభ్యులు స్పీకర్‌ వెల్‌లోకి ప్రవేశించి నినాదాలు చేశారు.

కల్యాణలక్ష్మి సాయం రూ. 1,00,116

Submitted by arun on Mon, 03/19/2018 - 12:08

పేదింటి ఆడపిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపికబురు అందించింది. నిరుపేద కుటుంబంలోని ఆడపిల్లల వివాహం కోసం ఇప్పటి వరకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద ఇస్తున్న ఆర్థిక సాయాన్ని మరింత పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని శాసనసభ వేదికగా సీఎం ఇవాళ ప్రకటించారు. ఇక నుంచి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ సాయాన్ని రూ. 1,00,116లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. మొదట రూ. 51 వేలు, ఆ తర్వాత రూ. 75 వేలకు పెంచారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు 3 లక్షల 65వేల మంది మహిళలకు లబ్ధి చేకూరిందని సీఎం తెలిపారు. 

రష్యా ఎన్నికల్లో పుతిన్ కే పట్టం

Submitted by arun on Mon, 03/19/2018 - 10:14

రష్యా అధ్యక్ష ఎన్నికల్లో వ్లాదిమిర్ పుతిన్.. ఘన విజయం సాధించారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో రష్యా జనం.. పుతిన్ కే పట్టం కట్టారు. 73.9 శాతం ఓట్లతో నాలుగోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గత రెండు దశాబ్దాలుగా రష్యాను ఏలుతున్న పుతిన్‌కు అక్కడి ప్రజలు మరోసారి అవకాశం ఇచ్చారు. బరిలో ఏడుగురు అభ్యర్థులుండగా.. ప్రధాన ప్రత్యర్థి అయిన అలెక్సీ నావల్నీ.. న్యాయపరమైన చిక్కులతో పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో పుతిన్ గెలుపు.. లాంఛనమే అని తేలిపోయింది. 

నేడు లోక్‌సభ ముందుకు అవిశ్వాస తీర్మానాలు

Submitted by arun on Mon, 03/19/2018 - 10:08

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మోసం చేసిన ఎన్డీయే ప్రభుత్వంపై వైసీపీ, టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవాళ లోక్‌సభ ముందుకు రానుంది. పార్టీ తరఫున ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి శుక్రవారం లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు మరోసారి నోటీసు అందజేశారు. సభా నిబంధనల ప్రకారం కేంద్రమంత్రి మండలి సభ విశ్వాసాన్ని కోల్పోయిందని ఆ నోటీసులో ఆయన తెలిపారు. అటు టీడీపీ ఎంపీ తోట నరసింహం కూడా అవిశ్వాస తీర్మానం నోటీసును అందజేశారు. 

బీజేపీ అహంకారంతో రాజకీయాలు చేస్తోంది: సోనియా గాంధీ

Submitted by arun on Sat, 03/17/2018 - 17:46

బీజేపీ అహంకారంతో విభజన రాజకీయాలకు పాల్పడితే కాంగ్రెస్‌ పార్టీ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తోందని ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పష్టం చేశారు. అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కాంగ్రెస్‌ పార్టీ మొత్తం అండగా నిలవాలని సోనియా పిలుపునిచ్చారు. ప్రధాని మోడిపైన విమర్శలు కురిపించారు సోనియా. అటు కాంగ్రెస్‌ పార్టీని కంటికి రెప్పలా కాపాడిన సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలపై పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశంసలు కురిపించారు. 

ఏపీకి ప్రత్యేక హోదాపై ఏఐసీసీ ప్లీనరీలో తీర్మానం

Submitted by arun on Sat, 03/17/2018 - 15:19

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై కట్టుబడి ఉన్నట్లు.. కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఢిల్లీలో జరుగుతున్న రెండో రోజు ప్లీనరీ సమావేశాల్లో దీనిపై ఆ పార్టీ రాజకీయ తీర్మానం చేసింది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా ప్రత్యేక హోదాను ఇప్పటివరకు ఇవ్వకపోవడాన్ని ఖండించిన పార్టీ.. విభజన చట్టాన్ని అమలు చేయాలని స్పష్టం చేసింది.