jagan

పీఎంవోలో జగన్ అనుచరులు ..రేపోమాపో కేసులు మాఫీ

Submitted by lakshman on Sun, 03/18/2018 - 15:01

సీఎం చంద్రబాబు వైసీపీ పై విమర్శలు చేస్తున్నారు. కేంద్రంపై అవిశ్వాసతీర్మానం అంటూనే జగన్ తన కేసుల్ని మాఫీ చేసుకునేందుకే పీఎంవో చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. 
చంద్రబాబు తన 40ఏళ్ల రాజకీయ చతురతకు పదును పెడుతున్నారు. ఏపీకి ప్రత్యేకహోదా కావాలంటూ వైసీపీ కేంద్రంపై అవిశ్వాసం పెట్టిన విషయం తెలిసిందే. అంతేకాదు తనతో పాటు అధికార పక్షం టీడీపీ చేతులు కలపాలని జగన్ పిలుపునిచ్చారు. దీంతో కక్కలేక మింగలేక వైసీపీ కి మద్దతు పలికిన టీడీపీ ..గంటల వ్యవధిలోనే రూటు మార్చే తామే సొంతంగా కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. 

జ‌గ‌న్ స్థానం కోసం ప‌వ‌న్ త‌హ‌త‌హ..?

Submitted by lakshman on Sun, 03/18/2018 - 14:46

2019ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.  అందివచ్చిన అవకాశాన్ని చేజారనీయకుండా ఒడిసిపట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటే హస్తినలో ఏపీ రాజకీయం వేడెక్కుతుంటే..ఏపీలో పవన్ కల్యాణ్ తన రాజకీయ చదరంగంలో రాజవ్వడంకోసం ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో వైసీపీ స్థానాన్ని దక్కించుకునేందుకు పవన్ కల్యాణ్ పావులు కదుపుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

వైసీపీ + బీజేపీ + జ‌న‌సేన = 2019 ఎన్నిక‌లు..?

Submitted by lakshman on Sat, 03/17/2018 - 03:37

ఏపీలో  అంతా అనుకున్న‌ట్లే జ‌రుగుతుంది. గ‌త కొద్ది కాలంగా టీడీపీ  - బీజేపీకి పొస‌గ‌డంలేదు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు ప్ర‌తివిమ‌ర్శ‌ల‌తో రాజ‌కీయాన్ని వేడిపుట్టించారు.  

జ‌గ‌న్ ఆ ఊర‌పంది ఆలోచ‌న‌ల్ని మానుకో

Submitted by lakshman on Fri, 02/23/2018 - 23:26

వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ పై టీడీపీ మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి నిప్పులు చెరిగారు. కొద్దిరోజుల క్రితం సీఎం చంద్ర‌బాబు ఆదినారాయ‌ణ‌రెడ్డి -  రామ‌సుబ్బారెడ్డి లు ఇద్ద‌రు త‌మ ప‌నుల్లో చెరో అర్ధ రూపాయి చొప్పున పంచుకోమ‌ని చెప్పారంటూ ఓ వీడియో నెట్టింట్లో వైర‌ల్ అయ్యింది. ఆవీడియో పై స్పందించిన ఆదినారాయ‌ణ రెడ్డి చంద్ర‌బాబు చెబితే తాము పంచుకునేంత నీచులమా...! తాను, రామసుబ్బా రెడ్డి ఎలాంటి ప్రతిపాదనలు పెట్టినా సీఎం అంగీకరిస్తామని చెప్పారని ఆదినారాయణ రెడ్డి అన్నారు. కానీ వాటాల గురించి మాట్లాడలేదని అభిప్రాయపడ్డారు. తాము వాటాలు పంచుకునేంత నీచంగా కనిపిస్తున్నామా అని ప్రశ్నించారు.

జగన్‌ కేసులో ప్రధాని మోదీకి నోటీసులు

Submitted by arun on Thu, 02/22/2018 - 13:22

జగన్ అక్రమాస్తుల కేసులో భారత ప్రభుత్వాన్ని అంతర్జాతీయ కోర్టుకు మారిషస్ ప్రభుత్వం లాగింది. ఇందూ టెక్ జోన్ ఐటీ సెజ్ కేసుతో తాము భారీగా నష్టపోయామని, న్యాయం చేయాలని కోరుతూ మారిషస్ ప్రభుత్వం నెదర్లాండ్స్ లోని ఆర్బిట్రేషన్ కోర్టుకు విన్నవించుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ సహా  కేంద్ర ఆర్థిక, వాణిజ్య పన్నులు, న్యాయ శాఖ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రులకు నోటీసులు జారీ చేసింది. తమ పెట్టుబడులకు విఘాతం కలిగిందని పేర్కొంటూ, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రా కార్పొరేషన్ కు మారిషస్ ప్రభుత్వం ఓ లేఖ రాయడంతో పాటు మోదీకి లీగల్ నోటీసులు జారీ చేసింది.

జగన్... దమ్ముంటే ఈరోజే చేయించు

Submitted by arun on Wed, 02/14/2018 - 14:18

ప్రత్యేక హోదాపై కేంద్రం స్పందించకపోతే వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ వ్యాఖ్యలపై ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్‌కు దమ్ముంటే ఇవాళే ఎంపీలతో రాజీనామాలు చేయించాలని సవాల్ విసిరారు. ఏప్రిల్‌లో రాజీనామాలు చేస్తే ఆ తర్వాత ఉప ఎన్నికలు రావనే అలా చేస్తున్నారని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ఏడాది క్రితం కూడా ఎంపీలతో రాజీనామాలు చేయిస్తామన్నారని ఈ సందర్భంగా ఎంపీ గుర్తు చేశారు.

పార్టీ ప‌రువును గంగ‌లో క‌లిపేస్తున్న జ‌గ‌న్ ఆత్మ ..?

Submitted by lakshman on Mon, 02/12/2018 - 08:30

వైసీపీ నేత‌, ఆ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు పై సొంత పార్టీ నేత‌లే నిప్పులు చెరుగుతున్నారు. ఆయ‌న‌ను నిలువ‌రించండి.. పార్టీ ప్ర‌తిష్ట దెబ్బ‌తీస్తున్నాడు.. మ‌న ఇమేజ్‌ని డ్యామేజ్ చేస్తున్నాడ‌ని అధినేత జ‌గ‌న్‌కు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు అందుతున్నాయ‌ట‌.

ఎన్డీయేలోకి జగన్‌ ?

Submitted by arun on Tue, 01/23/2018 - 11:30

బీజేపీతో దోస్తీకి జగన్‌ సై అంటున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని స్పష్టం చేశారు. CNN న్యూస్‌‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన జగన్‌.. బీజేపీతో పొత్తుపై క్లారిటీ ఇచ్చారు. ప్రత్యేక హోదా ఇస్తే బేషరతుగా బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 

పుట్టిన గడ్డనే అభివృద్ధి చేయని చంద్రబాబు

Submitted by arun on Sun, 01/14/2018 - 12:06

సొంతగడ్డ చంద్రగిరి నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు ఏం చేశారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రశ్నించారు. శనివారం ప్రజాసంకల్పయాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రాపురంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రవాసాంధ్రులు సైతం తాము పుట్టిన గడ్డపై మక్కువతో అభివృద్ధి చేస్తుంటే చంద్రబాబు చదివిన శేషాపురం పాఠశాల తోస్తే పడిపోయే స్థితిలో ఉందన్నారు. చంద్రగిరిలో 100 పడకల ఆసుపత్రి అభి వృద్ధికి వైఎస్‌ జారీ చేసినప్పటికీ అదెలాంటి అభి వృద్ధికి నోచుకోకపోవడం చంద్రబాబు చిత్తశుద్ధిని తెలి యజేస్తోందన్నారు.

కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొత్త ట్విస్ట్‌

Submitted by arun on Tue, 12/26/2017 - 09:59

కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తి రేపుతున్నాయ్. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది వైసీపీ. ఇంతలోనే వైసీపీ నేతలు నిర్ణయం మార్చుకున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు పార్టీ అధ్యక్షుడు గౌరు వెంకట్‌రెడ్డి  రెడీ అయ్యారు. పార్టీ అధినేత జగన్ ఒప్పుకుంటే వైసీపీ తరపున, అంగీకరించకపోతే ఇండిపెండెంట్ గా బరిలోకి దిగేందుకు రెడీ అయ్యారు గౌరు వెంకట్ రెడ్డి.