akhil's movie 'hallo' movie satilite rates

అఖిల్ 'హలో' శాటిలైట్స్ రైట్స్ ఎంతో తెలుసా..?

Submitted by kasi on Sat, 12/16/2017 - 11:15

అక్కినేని వారబ్బాయి అఖిల్ రెండవ సినిమాగా 'హలో' ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఈ నెల 22వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్ .. టీజర్ .. ఆడియో అభిమానుల్లో అంతకంతకూ ఆసక్తిని పెంచుతూ వెళ్లాయి. దాంతో ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కి గట్టిపోటీ ఏర్పడింది. చివరికి జీ తెలుగు ఛానల్ వారు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను సొంతం చేసుకున్నారు.