Pranay Murder Case

అర్ధరాత్రి ప్రణయ్‌ ఇంట్లో ఆగంతకుడు

Submitted by arun on Mon, 11/05/2018 - 13:11

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ ఇంట్లో అగంతకుడు చొరబడడం కలకలం సృష్టించింది. 2 నెలల క్రితం ప్రణబ్ హత్యకు గురైన తర్వాత పెరుమాళ్ల బాలస్వామి కుటుంబానికి పోలీసులు భద్రత కల్పించారు. ప్రస్తుతం ప్రణయ్ కేసు విచారణ వేగంగా జరుగుతోంది. ఆదివారం సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తుండగా శనివారం తెల్లవారు జామున దుండగుడు ఇంటి ఆవరణలో కలియతిరిగిన విషయాన్ని గుర్తించామని ప్రణయ్‌ తండ్రి బాలస్వామి తెలిపారు. ఆగంతకుడు ముఖానికి ముసుగు ధరించాడని, అదే సమయంలో అటుగా వచ్చిన పోలీసులను చూసి ఆగంతకుడు పారిపోయినట్లు చెప్పారు. బాలస్వామి పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ప్రణయ్ ఆత్మ ఏడుస్తోందా..?

Submitted by arun on Mon, 10/15/2018 - 14:06

ప్రణయ్‌ ఆత్మ తమతో మాట్లాడుతుందంటూ హైదరాబాద్‌కు చెందిన దంపతుల వ్యాఖ్యలు మరోసారి కలకలం రేపాయి. పెద్దలను కాదని ప్రేమ వివాహం చేసుకున్న ప్రణయ్‌ మర్డర్‌ తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే ప్రణయ్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆయన భార్య అమృత గత కొంతకాలంగా పోరాడుతోంది. ఈ సమయంలో అనూహ్యంగా హైదరాబాద్‌ శివారు పటాన్‌ చెరుకు చెందిన సత్యప్రియ దంపతులు పరామర్శ పేరుతో మిర్యాలగూడలోని అమృత ఇంటికి చేరుకుంది. 

అమృతకు వ్యవసాయభూమి, డబుల్‌ బెడ్‌రూం ఇల్లు

Submitted by arun on Thu, 09/20/2018 - 15:48

మిర్యాలగూడలో కిరాయి హంతకుల చేతిలో హత్యకు గురైన ప్రణయ్ కుటుంబ సభ్యులను, ప్రణయ్ భార్య అమృత వర్షిణిని మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శించారు. ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని చెప్పారు. మారుతీరావు లాంటి వ్యక్తులకు సంఘ బహిష్కణ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలను కుటుంబ సభ్యులకు అందజేస్తామని ప్రకటించారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం తరపున 8 లక్షల 25వేల రూపాయలు, డబుల్ బెడ్‌రూం ఇల్లు, వ్యవసాయ భూమి ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశించడం జరిగిందన్నారు. గంటల వ్యవధిలోనే పోలీసు యంత్రాంగం వేగంగా స్పందించి హంతకులను పట్టుకోవడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఇటువంటి సంఘటనలు సహించదని తెలిపారు.

ప్రణయ్ హత్య కేసు నుంచి తప్పించుకోవడానికి మారుతీరావు మాస్టర్ ప్లాన్...దృశ్యం సినిమా తరహా ...

Submitted by arun on Wed, 09/19/2018 - 10:03

ప్రణయ్ హత్య కేసు నుంచి తప్పించుకోవడానికి అమృత తండ్రి మారుతీరావు మాస్టర్ ప్లానే వేశాడు. కానీ ప్లాన్ బెడిసికొట్టి పోలీసులకు అడ్డంగా బుక్ అయ్యాడు. మారుతీరావు తమ్ముడు, కారు డ్రైవర్‌కు త్వరగా బెయిల్ వచ్చేఅవవాశముందని పోలీసులు చెప్పడంపై అమృత అభ్యంతరం వ్యక్తం చేసింది. బాబాయ్ బయటికి వస్తే తనకు ప్రాణహాని ఉందని అంటోంది. 

ప్రణయ్ హత్య కేసులో వీడిన సస్పెన్స్...నల్గొండ పోలీసుల అదుపులో కీలక నిందితుడు

Submitted by arun on Tue, 09/18/2018 - 13:39

ప్రణయ్ హత్య కేసులో సస్పెన్స్ వీడింది. సంచలనం సృష్టించిన ఈ కేసులో కీలక నిందితుడు శుబాష్ శర్మను నల్గొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రణయ్ ను కత్తితో నరికిచంపిన శర్మను.. బీహర్ పోలీసుల అనుమతితో నల్గొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, శర్మను బీహార్ లోని సమస్థీపూర్ కోర్టులో హాజరుపరిచారు. కోరు అనుమతి లబించడంతో నిందితుడు శర్మను నల్గొండకు తరలిస్తున్నారు. ప్రణయ్ హత్యకేసులో బీహర్ గ్యాంగ్ దే కీలక పాత్ర అని నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాధ్ తెలిపారు. 

ప్రణయ్‌ హత్యలో మాజీ ఎమ్మెల్యే హస్తం? వీరేశంను కూడా విచారిస్తున్నారా?

Submitted by arun on Tue, 09/18/2018 - 13:16

సంచలనం సృష్టించన ప్రణయ్ హత్యకేసులో మొత్తం ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్టు నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ తెలిపారు. ప్రణయ్ హత్యకు మొత్తం కోటి రూపాయాల ఒప్పందం కుదిరిందని ఆయన చెప్పారు. నల్గొండ గ్యాంగ్ తో కలిసి బీహార్ గ్యాంగ్ సుపారీ తీసుకుందన్నారు. అడ్వాన్స్ గా 18 లక్షలు తీసుకున్నారని విచారణలో తేలినట్టు ఎస్పీ రంగనాథ్ చెప్పారు. ప్రణయ్ ను చంపింది బీహార్ కు చెందిన వ్యక్తేనని తెలిపారు. నరిరేకల్ మాజీ ఎమ్మెల్యే వీరేశంని కూడా విచారిస్తున్నామని నల్గొండకి చెందిన ఐఎస్ఐఎస్ మాజీ టెర్రరిస్టులకు ప్రణయ్ హత్య కేసుతో సంబంధం ఉందన్నారు. 
  

ఫేస్‌బుక్‌ వేదికగా అమృత పోరాటం

Submitted by arun on Tue, 09/18/2018 - 11:42

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో తండ్రి కుల దురహంకారం కారణంగా భర్తను పోగొట్టుకున్న అమృత న్యాయం కోసం సామాజిక మాధ్యమం వేదికగా ఉద్యమాన్ని ఆరంభించింది. హత్యకు గురైన భర్త పేరుతో ‘జస్టిస్‌ ఫర్‌ ప్రణయ్‌’ పేరుతో ఫేస్‌బుక్‌ పేజీని సృష్టించింది. ‘ప్రణయ్‌ ఇప్పుడు ఒంటరి కాదు. నాతోపాటు కోట్ల మంది గుండెల్లో బతికే ఉన్నాడు’ అంటూ అమృత తొలి పోస్టు చేసింది. మిర్యాలగూడ పట్టణంలో ప్రణయ్‌ విగ్రహం ఏర్పాటు చేయాలని , ఈ దిశగా అందరూ సహకరించాలని కోరింది.

డాక్టర్ తో ప్రణయ్ చివరి మాటలు..!

Submitted by arun on Tue, 09/18/2018 - 10:56

ప్రణయ్‌ దారుణహత్య మా ఆస్పత్రి సమీపంలోనే జరగడం చాలా బాధకలిగించిందన్నారు డాక్టర్‌ జ్యోతి. రెగ్యులర్‌ చెకప్‌ వచ్చినప్పుడు బేబీ హార్ట్‌బీట్‌ విని  ప్రణయ్‌ చాలా హ్యాపీగా  ఫీలయ్యాడని చెప్పింది. ఫ్యూచర్‌లో బిజినెస్‌ చేయాలనుకుంటున్నట్లు చెప్పిన ప్రణయ్‌ బయటకు వెళ్లగానే మృతి చెందడం కలిచివేసిదంటున్నారు డాక్టర్‌  జ్యోతి.

ప్రణయ్‌ కేసులో కొత్త పేరు...ఎవరీ అస్గర్ అలీ.. ప్రణయ్ హత్యతో అతనికి లింకేంటి?

Submitted by arun on Tue, 09/18/2018 - 10:25

సంచలనం సృష్టిస్తున్న మిర్యాలగూడ ప్రణయ్‌ హత్య కేసులో కొత్తపేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటిదాకా ఈ కేసులో ప్రధాన సూత్రధారి అబ్దుల్‌ బారీ అని భావిస్తుండగా తాజాగా వెలుగులోకి వచ్చిన అంశాల ప్రకారం బారీ గురువు అస్గర్‌ అలీనే స్వయంగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. మారుతీరావును నుంచి కోటి సుపారీ తీసుకున్న అస్గర్‌ అలీ హత్యలో పాల్గొన్న వ్యక్తికి పది లక్షలు చెల్లించినట్లు తేలింది. 

ప్రణయ్‌ హత్య కేసులో వెలుగు చూస్తున్న సంచలన విషయాలు...అమృతను మర్చిపోతే కోటిన్నర ...

Submitted by arun on Tue, 09/18/2018 - 09:38

ప్రణయ్‌ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. పోలీసుల విచారణలో మారుతీరావు నుంచి కీలక విషయాలు రాబట్టినట్టు తెలుస్తోంది. అమృతను మర్చిపోతే కోటిన్నర ఇస్తానంటూ ప్రణయ్‌కు మారతీరావు ఆఫర్‌ ఇచ్చాడని.. మిర్యాలగూడ వదిలివెళ్లాలంటూ ప్రణయ్‌ కుటుంబంపై ఒత్తిడి తెచ్చినట్టు విచారణలో తేలింది. ప్రణయ్‌, అమృత కలిసి ఉన్న వీడియో, ఫొటోలు చూసి.. వారిపై మహుతీరావు మరింత కక్ష పెంచుకున్నట్లు విచారణలో వెల్లడించాడు. ప్రణయ్‌ హత్య కేసులో నిందితులను సాయంత్రం 5 గంటలకు.. పోలీసులు  మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.