maha kutami... telangana politics

కూటమిలో కొలిమి!! మాడేదెవరికి? మూడేదెవరికి?

Submitted by santosh on Wed, 10/10/2018 - 13:07

మహాకూటమిలో అప్పుడే లుకలుకలు మొదలైనాయి. రోజు రోజుకు ఎడతేరపి లేకుండా సాగుతున్న చర్చలు, సీట్లు సర్దుబాట్లు కాకపోవడంతో.. జన సమితి అధినేత, కాంగ్రెస్ పార్టీకి డెడ్ లైన్ విధించారు. నలబై ఎనిమిది గంటల్లోగా సీట్లు ఖరారు విషయం తేల్చాలని సూచించారు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తుందని అంతా ఎదురు చూస్తున్నారు.

కలిసి సాగుతారా? కారు జోరుకు బ్రేక్‌ వేస్తారా? మహాకూటమి మర్మమేంటసలు?

Submitted by santosh on Mon, 09/17/2018 - 12:32

ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ దెబ్బతీయడమే లక్ష్యంగా  మహాకూటమి ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నేతలు భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించారు. అత్యంత కీలకమైన సీట్ల పంపకంపై ఆచితూచి వ్యవహారిస్తున్నారు. తాము బలంగా ఉన్న స్థానాలను కోల్పోకుండా ... వ్యతిరేక ఓటు చీలకుండా వ్యూహాలకు పదును పెడుతున్నారు. కలిసికట్టుగా సాగితేనే కారు జోరుకు బ్రేకులు వేయగలుగుతామని నిర్ధారణకు వచ్చిన కాంగ్రెస్ నేతలు మహా కూటమికి రంగం సిద్ధం చేశారు.  కాంగ్రెస్ ఆధ్వర్యంలో పురుడు పోసుకున్న ఈ కూటమిలో  ఇప్పటి వరకు తెలుగుదేశం, తెలంగాణ జన సమితి, సిపిఐలు వచ్చి చేరాయి.